బీహార్‌లో ఎన్నికల సమరం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. విపక్ష కూటమి మాత్రం ఎవరికి వారే విడివిడిగా పోటీ చేస్తున్నారు. తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రముఖ జనపద గాయని మైథిలి ఠాకూర్ అలీనగర్ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అలీనగర్ ప్రజల ఆశీస్సులు తనకు స్ఫూర్తి ఇచ్చాయని.. వారి ఆశీస్సులతో విజయం సాధిస్తానని మైథిలి ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు.
బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల సమరం నడుస్తోంది. అంతేకాదు తొలి విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇప్పటికే బీజేపీ, దాని మిత్రపక్షం జేడీయూలు తొలి విడత అభ్యర్థుల లిస్ట్‌లను విడుదల చేశాయి. పలువురు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ రఘోపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. మరోసారి ఈ స్థానం నుంచి గెలిచి, హ్యట్రిక్ సాధించాలని తేజస్వీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
బీహార్‌లో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఇక ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బీహార్‌లో ప్రస్తుతం సీట్ల పంపకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు ఇండియా కూటమి వంతు వచ్చింది. ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలు పూర్తైనట్లు తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా ఆర్జేడీ తీవ్ర కసరత్తు చేసినట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
బీహార్‌లో హైవోల్టేజ్ ఎన్నికల వేళ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. ఐఆర్‌సీటీసీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, భార్య రబ్రీ దేవిపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది.
యువతకు ఇష్టమైన నేత, పవర్ స్టార్‌గా పేరు గాంచిన భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్ తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2024, మే నెలలో ఎన్డీఏ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థిగా కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు
బీహార్ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు కీలక సూచనలు చేసింది. ఏఐ-జనరేటెడ్ వీడియోలను దుర్వినియోగం చేయవద్దని రాజకీయ పార్టీలను హెచ్చరించింది. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా సోషల్ మీడియా పోస్టులపై కఠినమైన నిఘా ఉంచినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.