త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇంకోవైపు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌పై తీవ్ర కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించేలా ఈసీ ప్లాన్ చేస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికలపై సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Earthquake: ఓ వైపు భూప్రకంపనలు.. ఇంకోవైపు వణికిన పిల్లల వార్డు.. అస్సాం నర్సులు ఏం చేశారంటే..!
సెప్టెంబర్ 14న (ఆదివారం) ఓట్ వైబ్ సర్వే తన ఫలితాలను ప్రకటించింది. అయితే ఈ ఫలితాల్లో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈసారి జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ కాబోతున్నారని స్పష్టం చేసింది. ఎక్స్-ఫ్యాక్టర్‌గా ప్రశాంత్ కిషోర్ మారొచ్చని తాజా ఒపీనియన్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక ప్రధాన కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొందని తెలిపింది. ఎన్డీఏ కూటమికి 36.2 శాతం ఓట్లు వస్తుండగా.. ఇండియా కూటమికి 35.8 శాతం మంది ఓట్లు రానున్నట్లు తెలిపింది. ఎన్నికల ఫలితం చివరి నిమిషంలో వచ్చే మార్పులను బట్టి ఉంటుందని సర్వే పేర్కొంది.
ఇది కూడా చదవండి: Acharya Devvrat: మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణం
ఇక మహాఘట్‌బంధన్‌కు యువతే ప్రధాన ఓటు బ్యాంక్‌గా మారనుంది. ఇక కుల సమీకరణ లెక్కలు మాత్రం ఇరువైపులా కీలకంగా ఉన్నాయి. జూలైలో చేసిన సర్వేలో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా సెప్టెంబర్‌లో చేసిన సర్వేలో కూడా 48 శాతం నితీష్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేక వ్యక్తమైంది. జూలైలో 18.3 శాతం ఉండగా.. ఇప్పుడు 27.1 శాతానికి పెరిగింది. యువ ఓటర్లు (18-24) ప్రభుత్వ వ్యతిరేకతను (57%) వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమికి ముస్లింల ఓటు బ్యాంక్ కీలకంగా మారింది. 70 శాతం ముస్లింలు మహాఘట్‌బంధన్‌కే మద్దతు ఇస్తున్నారు. 5 శాతం మంది మాత్రం ఎన్డీఏ కూటమికి వేస్తామని చెప్పారు.
అగ్రవర్ణాల్లో, షెడ్యూల్డ్ కులాల్లో కూడా ఎన్డీఏకి బలమైన మద్దతు ప్రకటించారు. షెడ్యూల్డ్ కులాల్లో 43 శాతం మంది ఎన్డీఏకి మద్దతు ఇవ్వగా.. 25 శాతం మంది ప్రతిపక్ష కూటమికి మద్దతిచ్చారు. ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీకి 8.7 శాతం ఓట్లు వస్తున్నాయి. రెండు కూటమిల మధ్య తేడా జరిగితే ప్రశాంత్ కిషోర్‌నే కింగ్ మేకర్ అవుతారని సర్వే తేల్చి చెప్పింది. 13.70 శాతం మంది ప్రశాంత్ కిషోర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటుండగా.. నితీష్ కుమార్‌ను 24 శాతం మంది.. తేజస్వి యాదవ్‌ను మాత్రం 33.5 శాతం మంది కోరుకుంటున్నారు. అంటే తేజస్వి యాదవ్ క్రమక్రమంగా బలం పుంజుకుంటున్నారు.
అక్టోబర్-నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దీపావళి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.