ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంతి కిషోర్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. 51 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. 16 శాతం ముస్లింలకు కేటాయించగా.. 17 శాతం అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందినవారికి కేటాయించారు.
బీహార్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. శని, ఆదివారాల్లో ఎన్నికల బృందం బీహార్‌లో పర్యటించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ లక్ష్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
Karnataka: బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటకలో పెను రాజకీయ మార్పులు వస్తాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర అంచనా వేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మధ్య అధికార పోరాటం జరుగుతుంద జోష్యం చెప్పారు. తాజాగా విజయేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు గురించి బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని గుర్తు చేశారు. సిద్ధరామయ్య తొందరపడుతున్నట్లు కనిపిస్తున్నారన్నారు.
బీహార్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 22 లోపు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన కోసం ఈసీ బృందం శనివారం పాట్నాకు వచ్చింది.
BJP: రాబోయే బీహార్ ఎన్నికల్లో బురఖా ధరించిన ఓటర్లను చెక్ చేయాలని బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆర్జేడీ ఆరోపించింది. పోలింగ్ బూతుల్లో బురఖా ధరించిన మహిళల్ని ధ్రువీకరించాలని నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో జరిగిన సమావేశంలో బిజెపి చీఫ్ జైస్వాల్ కోరారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు శని, ఆదివారాల్లో బీహార్‌లో పర్యటిస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్గర్ యోజన పథకాన్ని ప్రారంభించి 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ. 10,000 జమ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తానూ.. నితీష్ కుమార్ బీహార్ అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు దసరా కానుక అందింది. శుక్రవారం ప్రధాని మోడీ మహిళా రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున ఖాతాల్లో జమయ్యాయి. మహిళా సాధికారత, స్వయం ఉపాధి కల్పించే దిశగా రూ.7,500 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించారు.
Bihar: బీహార్ ఎన్నికల్లో ఇటీవల ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ తల్లిని తిట్టడం వివాదంగా మారింది. కాంగ్రెస్ ఆమె ఏఐ వీడియోను ఉపయోగించి, ఒక వీడియోను రూపొందించడం వివాదస్పదమైంది. కోర్టులు ఈ వీడియోను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ర్యాలీలో ప్రధాని తల్లిని దూషిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రధాని తల్లి దివంగత హీరాబెన్ మోడీని విమర్శించారని బీజేపీ ఆరోపించింది. అయితే, ఆర్జేడీ నాయకులు మాత్రం ఈ…