Modi vs Priyanka: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు (డిసెంబర్ 1న) ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార -విపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కీలక నిర్ణయాలు దిశగా జన్ సురాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అడుగులు వేస్తున్నారు. తాజాగా శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో తాను సంపాదించే దాంట్లో 90 శాతం జన్ సురాజ్ పార్టీ చొరవ కోసం విరాళంగా ఇస్తానని ప్రకటించారు.
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందన్నారు.
CM Nitish Kumar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది. తాజా ట్రెండ్లు స్పష్టంగా NDA కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైందని చెబుతున్నాయి. ప్రజలు మరోసారి NDA కూటమిపై విశ్వాసం ఉంచినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, బీజేపీ ఇప్పటికే 40 స్థానాలు గెలుచుకుని.. మరో 50 స్థానాల్లో ముందంజలో ఉంది. మిత్రపక్షం JD(U) 26 స్థానాలు గెలిచి, 57 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం కలిపి…
PM Modi: బీహార్ ముఖ్యమంత్రి, నితీష్ కుమార్, ఇతర జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) నాయకులకు ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అధికార కూటమి విజయం సాధించినందుకు ఆయన అభినందించారు. ఈ “అద్భుతమైన ప్రజల తీర్పు”తో బీహార్ ప్రజలకు సేవ చేసే శక్తి ఎన్డీఏకు లభిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఎన్డీఏ బీహార్‌లో అన్ని రకాల అభివృద్ధిని అందించడం వల్లే ఈ అఖండ విజయం సాధ్యమైందని ప్రధాని వరుస ‘ఎక్స్’ పోస్టుల్లో తెలిపారు. ఈ…
Bihar Elections: మన దేశంలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న రంగాలు ఏంటో తెలుసా.. క్రీడలు, సినిమా, రాజకీయాలు. ఇది ఎందుకు చెప్పుకున్నాం అంటే క్రికెట్‌లో రోహిత్ – కోహ్లీ జంట తెలియని వారంటూ ఉండరు. వీళ్లు మైదానంలో ఉన్నారంటే ప్రత్యర్థి జట్టుకు విజయం చాలా దూరంలో ఉన్నట్లే అని క్రీడా విశ్లేషకులు చెబుతుంటారు. అచ్చంగా ఇలాంటి జోడీనే బీహార్ ఎన్నికల్లో మ్యాజిక్ చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జోడీ ఎవరిదో తెలుసా.. బీహార్…
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా అధికార ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూటమి ఓటమి అంచున ఉంది. ప్రతిపక్ష కూటమి అధికారానికి దూరం కావడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ పార్టీ ఆర్జేడీ ఓటమికి ప్రధాన కారణాల్లో కుటుంబ కలహాలు కీలకమైనవిగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అన్నాదమ్ములు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ మధ్య ఒక రకంగా యుద్ధం…
Pawan Kalyan: దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో బీహార్ ఎన్నికల ఫలితాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. బీహార్‌లో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించేందుకు దిశగా సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నాయకులు స్పందించారు. ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఏ విజయాన్ని అభినందిస్తూ.. బీహార్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద చూపుతున్న నమ్మకాన్ని మరోసారి రుజువుచేశారని అన్నారు. అభివృద్ధి, పారదర్శక పాలనకు ప్రజలు ఇచ్చిన…
Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తం ఆసక్తి నెలకొంది. రేపు (నవంబర్ 14)న కౌంటిక్ జరగబోతోంది. బీహార్‌లో అధికారంలోకి వచ్చేది ఎన్డీయేనా?, మహాఘట్‌బంధన్ కూటమా? అనేది రేపటితో తేలబోతోంది. అయితే, కౌంటింగ్ వేళ ఆర్జేడీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీహార్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తే నేపాల్, బంగ్లాదేశ్ తరహా నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతాయని ఆర్జేడీ నేత సునీల్ సింగ్ ఎన్నికల అధికారుల్ని హెచ్చరించారు.
బీహార్‌లో మంగళవారమే మలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పోలింగ్ సిబ్బంది కూడా బూత్ సెంటర్లకు చేరుకుంటున్నారు. తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి విడత పోలింగ్ కూడా ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.