బీహార్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రులు విరామం లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
బీహార్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు వారం రోజుల సమయమే మిగిలి ఉంది. ఇక దీపావళి, ఛత్ పండుగలు ముగియడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నాయకులంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ, అమిత్ షా, కేంద్రమంత్రులు జోరుగా ప్రచారం చేస్తుండగా.. గురువారం ప్రధాని మోడీ పలుచోట్ల ర్యాలీలు నిర్వహించనున్నారు.
Amit Shah: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు వ్యాఖ్యల పదును పెరిగింది. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏన్డీయే సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ అని స్పష్టం చేశారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బీహార్ ఎన్నికల వేళ అన్నదాతల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఫర్టిలైజర్ సబ్సిడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.రూ.3,000 కోట్ల రూపాయల సబ్సిడీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా దూకుడుగా వెళ్తున్నాయి. ఇక బీహార్ ఎన్నికల వేళ జాన్ సూరాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి కీలక సలహా ఇచ్చారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్జేడీకి బిగ్ షాక్ తగిలింది. ఆర్జేడీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు ప్రతిమా కుష్వాహా పార్టీకి గుడ్‌బై చెప్పారు. శనివారం ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
బీహార్‌లో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే జన్ సురాజ్ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీపై జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ధ్వజమెత్తారు.
ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అక్టోబర్ 24న బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
బీహార్‌లో ఎన్నికల సమరం నడుస్తోంది. రెండు విడతల్లో జరుగుతున్న పోలింగ్‌కి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో దశ ఎన్నికల ప్రక్రియకు నామినేషన్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 143 మందితో కూడిన అభ్యర్థులను జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది.