PM Modi: బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్న మోడీ.. ఎప్పటినుంచంటే..!
- బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్న మోడీ
- అక్టోబర్ 24న ఎన్నికల ప్రచారం ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అక్టోబర్ 24న బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక ఎన్నికల ప్రచారమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగనున్నారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu Rain: తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు.. విమాన రాకపోకలకు అంతరాయం
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ఎన్నికల షెడ్యూల్ రాక ముందు పలుమార్లు ప్రధాని మోడీ బీహార్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అంతేకాకుండా మహిళల ఖాతాలో రూ.10,000 జమ చేశారు. ఇక ఎన్నికల సమరానికి సమయం తక్కువగా ఉండడంతో ఈనెల 24 నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
ఇది కూడా చదవండి: Bihar Elections: 143 మందితో జాబితా విడుదల చేసిన ఆర్జేడీ
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. ఇండియా కూటమి మాత్రం విడివిడిగా పోటీ చేస్తోంది. బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు వరకు విపక్ష కూటమి కలిసే ఉంది. ఓటర్ యాత్ర పేరుతో రాష్ట్రమంతా చుట్టేశారు. తీరా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక మాత్రం సీన్ రివర్స్ అయింది. సీట్ల పంపకాలలో తేడానో.. లేదంటే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తిరకాసో తెలియదు గానీ.. చివరి నిమిషంలో ఇండియా కూటమి చీలిపోయింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సొంతంగానే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించుకుంటున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న విపక్ష కూటమి కలలు కల్లలైనట్లుగానే కనిపిస్తున్నాయి. విపక్ష కూటమి చీలికను ఎన్డీఏ కూటమి క్యాష్ చేసుకుంటోంది. ఆయా హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది.
ఇది కూడా చదవండి: PM Modi: గోవాలో నౌకాదళంతో కలిసి మోడీ దీపావళి వేడుకలు
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!