భారత వాతావరణ విభాగం (IMD) ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమయ్యే ఉష్ణోగ్రతల పెరుగుదలను అంచనా వేసింది. ఇది హైదరాబాద్‌లో వేసవి ప్రారంభ ఆగమనాన్ని తెలియజేస్తుందని, నగరంపై శీతాకాలపు పట్టు సడలుతుందని సూచిస్తుంది. IMD-హైదరాబాద్‌లోని శాస్త్రవేత్త డాక్టర్ ఎ. శ్రావణి, హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో సాధారణ స్థాయికి వచ్చే ముందు వచ్చే ఐదు రోజుల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, ఫిబ్రవరి మధ్యకాలం తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని భావిస్తున్నారు. చందానగర్‌లో బుధవారం అత్యధిక గరిష్ట…
గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.…
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై రాయితీతో చెల్లించే గడువును పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15 వరకు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో విధించిన గడువు ఇవాళ్టితో ముగుస్తున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15 వరకు పొడిగిస్తూ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 25 వరకు ఉన్న చలాన్లపై మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. తొలుత గత ఏడాది…
ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు కారణం నిరుద్యోగ యువతీ యువకులే అని ఆయన అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యుగులకు ఒరిగిందేం లేదన్నారు రేవంత్ రెడ్డి. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. వాళ్లు రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన చేయలేదని, వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు…
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకుని శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడిని చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు జైలులో శివ బాలకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ కోర్టు శివ బాలకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శివ బాలకృష్ణకు 10 రోజుల రిమాండ్ విధించాలని…
కూర్మగుడా కార్పొరేటర్ మహాపారా ఇంటి బకాయి ఉండటంతో వెళ్లిన విద్యుత్ ఉద్యోగి పై ఆరుగురు దాడి చేశారు. హైదరాబాద్ పాతబస్తీ మాదన్న పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ బకాయిలు వసూళ్లు చేస్తున్న విద్యుత్ ఉద్యోగి రజినేశ్ బాబు పై కూర్మగుడా కార్పొరేటర్ మహాపారా సోదరుడు శరఫత్, ఓ అడ్వకేటతో మరో నలుగురు దాడి చేశారు. బాధితునికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు. టీఎస్ యుఈ ఈయు – సీఐటియూ యూనియన్ సభ్యులు పోలీసు స్టేషన్లకు…
నోటికివచ్చినట్టు మాట్లాడటానికి సిగ్గుందా? బీఆర్‌ఎస్ నేతలపై భట్టి ఫైర్ ఇంటికో ఉద్యోగం, ఊరికో బడి, కేజీ టు పీజీ, మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు నలభై రోజుల నిండని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాటానికి సిగ్గుందా? బుద్ధి ఉందా? అంటూ…
పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక కోసం సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఈసీ సమావేశంలో అభ్యర్థులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా… తెలంగాణ ప్రజల హక్కులపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని మోడీ ప్రభుత్వం చెప్పిందని, కానీ.. రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను…
ఇంటికో ఉద్యోగం, ఊరికో బడి, కేజీ టు పీజీ, మూడు ఎకరాల భూ పంపిణీ, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన గత బిఆర్ఎస్ పాలకులు నలభై రోజుల నిండని కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్యారెంటీలు అమలు చేయడం లేదంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడాటానికి సిగ్గుందా? బుద్ధి ఉందా? అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు…
టీడీపీతో టచ్లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే..! రేపో మాపో సైకిల్ ఎక్కే అవకాశం..! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే.. తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్లోకి వెళ్లారట.. తిరుపతి జిల్లా సత్యవేడు (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీకి చెందిన శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం.. ఈ మధ్యే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు.. మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్రెడ్డి…