నిన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగుల బదిలీల అంశంపై కరీంనగర్‌లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు నిన్న రాత్రి బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం చేసేందుకు రాగా బండి సంజయ్‌ను కార్యకర్తలు కార్యాలయంలోకి పంపి తాళం వేశారు. దీంతో పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ రోజు కరీంనగర్ ఎక్సైజ్…
మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేస్తూ మరోమారు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీ ప్రత్యేక మార్జిన్లల్లో హేతుబద్దత కోసం ఏపీ ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో వ్యాట్, అదనపు ఎక్సైజు డ్యూటీలో హేతుబద్దత ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరెటీలపై 5-12 శాతం మేర ధరలు తగ్గే అవకాశం ఉండగా, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకూ ధరలు…
ప్రముఖ సర్చ్ ఇంజన్ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ (ఈయూ) కోర్టు భారీ జరిమానా విధించింది. బ్రసెల్స్‌లో ఐటీ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ గూగుల్‌కు రూ.20,285 కోట్ల భారీ జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. ఈయూ యాంటీట్రస్ట్ నిబంధనల ప్రకారం గూగుల్ చట్టవిరుద్దంగా ఇతర కంపెనీలకు మెరిట్‌లపై పోటీపడే అవకాశాన్ని, కొత్త ఆవిష్కరణలను నిరాకరించిందని, ముఖ్యంగా ఇది యూరోపియన్ వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు ఎంపిక చేసుకోవడంలో ప్రభావం చూపుతుందని ఈయూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓ కంపెనీకి…
తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మద్యం సేవించి పట్టుబడిన వారి వెంట మద్యం సేవించనివారేవరైనా ఉంటే వారికి వాహనాన్ని అప్పగించాలని సూచించింది. మద్యం తాగిన వారి వెంట ఎవరూ లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులను పిలిచి వాహనం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఎవరూ రాకపోతే వాహనం పీఎస్‌కు తరలించి…