Shiva Balakrishna : ఏసీబీ కస్టడీకి హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకుని శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. అతడిని చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు జైలులో శివ బాలకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఏసీబీ కోర్టు శివ బాలకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శివ బాలకృష్ణకు 10 రోజుల రిమాండ్ విధించాలని ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు అనుమతించింది. శివ బాలకృష్ణ ఎనిమిది రోజుల రిమాండ్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు తెల్లవారుజామున చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఏసీబీ అధికారులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. శివ బాలకృష్ణ పేరిట నాలుగు ఖాతాలు ఎస్‌బీఐ బ్యాంకులో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ బ్యాంకు లాకర్లను తెరిచే అవకాశం ఉంది.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
కాగా, ఐదు రోజుల క్రితం హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెరా కార్యదర్శి శివ బాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో 24వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల ఏసీబీ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. మణికొండలోని ఆయన నివాసం, అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించారు. 2018-2023 మధ్య కాలంలో హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక హోదాలో పనిచేసిన శివ బాలకృష్ణ. అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారన్న ఆరోపణలు, తాజాగా వారిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి అతని అరలో పదికి పైగా ఐఫోన్లు, 50 అత్యంత ఖరీదైన వాచీలు, నగదు కట్టలు, 5 కేజీల బంగారు ఆభరణాలు, 70 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. .
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!