తెలంగాణలో హుక్కా పార్లర్లపై నిషేధం.. అసెంబ్లీలో ఆమోదం.. తెలంగాణ రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును తెలంగాణ శాసనసభ సోమవారం ఆమోదించింది. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 సవరణ బిల్లు ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఈ రోజు సభ సమావేశమైన వెంటనే, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తరపున శాసనసభా వ్యవహారాల మంత్రి డి. శ్రీధర్ బాబు సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను…
కృష్ణా జలాలపై రేపు అసెంబ్లీలో క్లారిటీ ఇస్తామన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు అసెంబ్లీలో మా ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. ఎల్లుండి కేసీఆర్ మీటింగ్ స్టార్ట్ అయ్యే లోపు తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్తామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నీళ్లను జగన్ కోసం ఏపీకి తరలించారని, సెంటిమెంట్ వాడుకుందామంటే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. ఏపీకి నీళ్ల విషయంలో కేసీఆర్ సహాయం చేశారని జగన్ అసెంబ్లీ లో చెప్పారని, కేసీఆర్…
తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ చర్యలు.. తిరుపతి పోలీసులపై ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పలువురు పోలీసులపై వేటు వేసింది. అప్పటి ఈస్ట్ సీఐ శివప్రసాద్ రెడ్డి, వెస్ట్ సీఐ శివప్రసాద్ లను సస్పండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీరితో పాటు తూర్పు ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథరెడ్డిలను సస్పెండ్ చేసింది. అలిపిరి సీఐ అబ్బన్నను వీఆర్ కు బదిలీ చేశారు. తిరుపతి…
పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్, రీపోలింగ్‌కి ఆదేశం.. ఇమ్రాన్‌ఖాన్‌కి మద్దతుగా ఆందోళనలు.. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఎన్నికలు జరిగి మూడు రోజులు గడుస్తున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. పాక్ ప్రజలు ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు. దీంతో ఆ దేశంలో విజేత ఎవరనేది స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే, జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్-తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు ఎన్నికల్లో…
1. నల్లగొండ పట్టణం పాతబస్తీ హనుమాన్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ప్రతిష్ట మహోత్సవనికీ హాజరైన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. స్వామి వారి పూజకార్యక్రమం లో పాల్గొనున్న కిషన్ రెడ్డి..
1. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. అసెంబ్లీ ముగిసన తర్వాత భేట కానున్న కేబినెట్. బడ్జెట్‌కు ఆమోదం తెలపనన్న తెలంగణ కేబినెట్. రేపు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్. 2. నేడు ప్రధాని మోడీ, అమిత్ షాతో సీఎం జగన్ భేటీ. ఇవాళ ఉదయం 11.15 గంటలకు ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ. ఆ తర్వాత అమిత్ షాతో భేటీ కానున్న సీఎం జగన్. ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం. 3. ఢిల్లీలో నేడు…
పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ లోని ఓటర్ల వివరాలను తెలియజేస్తూ తుది జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,30,37,011 ఓటర్లు ఉన్నట్టు తెలియజేసింది. ఇందులో పురుషులు 1,64,47,132, మహిళలు 1,65,87,244, థర్డ్ జెండర్ 2,737 మంది ఉన్నారు. 15,378 సర్వీస్ ఓటర్లు, 3,399 ఓవర్సీస్ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువత ఇప్పటికీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో వికాస్ రాజ్ సూచించారు. తెలంగాణలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో…
పెళ్లి తిరస్కరించిందన్న ఆరోపణతో ఓ యువతిపై ఓ యువకుడు కత్తితో పొడిచి చంపగా, ఆమె కోడలు, మేనల్లుడు దాడిలో గాయపడిన సంఘటన ఖానాపూర్ పట్టణంలోని శివాజీనగర్‌లో గురువారం జరిగింది. ఖానాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మోహన్ మాట్లాడుతూ, శెట్పల్లి అలేఖ్య (20) తనతో పెళ్లి నిరాకరించినందుకు ఆమె స్నేహితుడు శ్రీకాంత్ కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అయితే.. అలేఖ్యకు ఆమె తల్లిదండ్రులు మరో పెళ్లి సంబంధాన్ని చూస్తున్నారు.. ఇది తెలిసిన శ్రీకాంత్…
శాసన సభ సమావేశాలు- నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల పై సమీక్ష చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా, సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై శాసన సభ మీటింగ్ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్బంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ…
బోధన్ మాజీ ఎమ్మెల్యే అమీర్ షకీల్, ఆయన కుమారుడు రహీల్ షకీల్‌తో పాటు మరో ఇద్దరిపై హైదరాబాద్ పోలీసులు ‘లుక్ అవుట్’ సర్క్యులర్ జారీ చేశారు. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, అంతర్జాతీయ సరిహద్దు చెక్‌పోస్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. గత ఏడాది డిసెంబర్ 24న సోమాజిగూడ ప్రజాభవన్ ఎదుట మద్యం మత్తులో ఉన్న రహీల్ షకీల్ తన కారును పోలీసు బారికేడ్‌పైకి ఢీకొట్టాడు. అతడిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించగా అక్కడి నుంచి ఇన్‌స్పెక్టర్ దుర్గారావు సహాయంతో…