తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ పరీక్షల తేదీలను ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. ఏప్రిల్ 20 నుంచి మే 5 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 20 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 21 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 20న తెలుగు మొదటి సంవత్సరం పరీక్ష, ఏప్రిల్ 22 మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష జరగనున్నాయి. ఏప్రిల్ 25 మొదటి సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 27.. మొదటి సంవత్సరం.. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్ష జరుగుతాయి.
ఏప్రిల్ 29 మొదటి సంవత్సరం ఫిజిక్స్ ఎకనామిక్స్ , పరీక్ష పెట్టనున్నారు. మే 2 మొదటి సంవత్సరం కెమిస్ట్రీ కామర్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు, విద్యాశాఖ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 21నుంండి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 21న రెండో సంవత్సరం తెలుగు పరీక్ష, ఏప్రిల్ 23 ఇంటర్ సెకండీయర్ ఇంగ్లిష్ పరీక్ష, ఏప్రిల్ 26న రెండవ సంవత్సరం మ్యాథ్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు, ఏప్రిల్ 28. సెకండీయర్ సంవత్సరం.. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 20 నుండి మే 5 వరకు పరీక్షలు ఇంటర్ ఫస్ట్ సెకండీయర్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు చక చక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మే 6,9 తేదీల్లో మైనర్ పరీక్షలు నిర్వహించనున్నారు.