కరోనా నేపథ్యంలో మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టుతుండడంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను పునఃప్రారంభించాయి. అయితే కరోనా నిబంధనలను మాత్రం కట్టుదిట్టంగా అమలు చేస్తూ.. విద్యాసంస్థలు నిర్వహించాలని ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కరోనా సెలవుల్లో జరగాల్సిన పరీక్షలు, పరీక్షా ఫీజు చెల్లింపులల్లో గందరగోళం నెలకొంది. దీంతో తాజా యూజీ 1, 3 సెమిస్టర్‌లతో పాటు 5వ సెమిస్టర్‌లకు పరీక్షా ఫీజు చెల్లింపు తేదీని పొడగిస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షా విభాగం అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఫిబ్రవరి 14 వరకు ఎలాంటి జరిమానా లేకుండా పరీక్షా ఫీజు చెల్లించవచ్చునని అధికారులు పేర్కొన్నారు.