టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ పార్టీ పోతుందని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో నెలకొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైన అభివృద్ధి, దేశవ్యాప్తంగా వ్యాప్తి చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్, జలాలను కూడా దేశం వాడుకోలేకపోతోందని, ఇది ఎవరి ఆసమర్థత అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఓ రాష్ట్రంలో ఇప్పడిప్పుడే రాత్రి పూట కూడా అన్నం తింటున్నామంటుంటే..…
టీఆర్ఎస్ 21వ ప్లీనరీ వేడుకలు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల హెచ్‌ఐసీసీలో అంగరంగగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ జెండావిష్కరణను సీఎం కేసీఆర్ గావించారు. అయితే అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 2 దశాబ్దాల క్రితం పరిస్థితులు అగమ్యగోచరంగా ఉంన్నాయన్నారు. ఏడుపొచ్చి ఏడుద్దామన్నా.. ఎవ్వరినీ పట్టుకొని ఏడువాలో తెలియని తెలంగాణ ప్రజల గుండె చప్పుడు నుంచి ఉద్భవించిన పార్టీయే టీఆర్‌ఎస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు ప్రారంభమైన టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు…
టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్ ప్రధాన కూడల్లో టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీసీసీ ప్రభాకర్. ఇతర రాజకీయ పార్టీలు కడితే ఫైన్ లు వేస్తారు… కేసులు పెడతారని, అవే నియమ నిబంధనలు అధికార పార్టీ కి వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. పురపాలక శాఖ అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహారిస్తున్నారన ఆయన మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో…
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్‌తో పాటు ఆమెభర్త రవి రాణాలు ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఇంటి ముందు ఇలాంటివి…
మహబూబాబాద్ కౌన్సిలర్ రవిని హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. హత్యతో సంబంధం ఉన్న 7గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో వినయ్, అరుణ్ ప్రధాన నిందితులుగా మిగిలిన ఐదుగురు వారికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. భూక్యా వినయ్ కుమార్, భూక్యా అరుణ్, అజ్మిరా బాలరాజు, గుగులోతు చింటూ, కారపాటి సుమంత్, అజ్మిరా కుమార్, గుగులోతు భావు సింగ్‌లు నిందితులుగా పోలీసులు వెల్లడించారు. వారి నుండి మారునాయుధాలు గొడ్డలి, తల్వార్, ట్రాక్టర్, కారును…
మహబూబాబాద్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. మహబూబాబాద్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పత్తిపాకలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి పనులను పరిశీలించేందుకు వెళ్లిన రవినాయక్‌పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. మెడ భాగంలో దాడి జరగడంతో రవి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రవిని చికిత్స నిమిత్తం స్థానికులు ఏరియా…
తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ ఆదివారం గౌహతి నుండి షిల్లాంగ్‌కు టాక్సీలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఒక ప్రకటనలో తెలిపింది. 83వ సీనియర్ జాతీయ, అంతర్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు షిల్లాంగ్‌కు విశ్వ దీనదయాళన్ తన ముగ్గురు సహచర క్రీడాకారులతో కలిసి గౌహతి నుండి షిల్లాంగ్‌కు కారులో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న 12 చక్రాల ట్రైలర్, రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి…
గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పై సీజేఐగా జస్టిస్ ఎన్వీ.రమణకు ప్రేమ, అభిమానం ఉంది కాబట్టే ఎన్నో రోజులుగా పరిష్కారంకాని సమస్యలను పరిష్కరించారన్నారు. ‘ఉమ్మడి హైకోర్టు విడిపోయాక బెంచీల సంఖ్య పెంపుపై గతంలో కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖ రాశాను. కానీ.. ఆ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది’. ‘సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక…
111 జీవోను ఎత్తివేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి.. మాట్లాడుతూ.. గతంలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు 111 జీవోను ఎత్తివేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే 111 జీవో ఎత్తివేతపై సీఎస్ సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ వేసినట్లు కేసీఆర్ తెలిపారు. పొల్యూషన్ బోర్డు, అటవీశాఖతో పాటు ఇతరులతో కలిసి ఎట్టిపరిస్థితుల్లో…
Nizamabad MLC Kalvakuntla Kavitha Says Ugadi Wishes to Telangana People. తెలంగాణ ప్రజలకు నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగాది పచ్చడిలో ఉన్న తీపి, పులుపు, ఒగరులా జీవితంలో కూడా సుఖదుఃఖాల ఉంటాయన్నారు. ఈ ఉగాది ప్రతి వారి జీవితంలో మరింత శుభాన్ని కలిగించాలని ఆమె కోరారు. అంతేకాకుండా తెలుగువారందరికీ ఇది శ్రీశుభకృత్ నామసంవత్సరాది అయితే.. తెలంగాణ యువతకు మాత్రం…