మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్‌తో పాటు ఆమెభర్త రవి రాణాలు ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు గతంలో ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సీఎం ఇంటి ముందు ఇలాంటివి చేయడానికి అనుమతులు లేవంటూ.. పోలీసులు నవనీత్ కౌర్ దంపతులను ఆరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే నవనీత్ కౌర్ దంపతులు అరెస్ట్‌తో ఒక్కసారిగా ముంబాయిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మేమేం టెర్రరిస్టుల కాదని, కేవలం సీఎం ఇంటిముందు హనుమాన్ చాలీసా పఠనం చేస్తామనడం నేరమా అంటూ నవనీత్ కౌర్ దంపతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు.