రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య వార్ నడుస్తూనే ఉంది. 73 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం కాగా.. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అయితే.. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా ధాటిని ఉక్రెయిన్ సైన్యం అడ్డుకుంటోంది. ఈ క్రమంలో రెండు వైపులా పెద్ద…
ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. చట్టాలు చేసినా.. కామాంధులు మాత్రం మారడం లేదు.. అన్య పుణ్యం తెలియని చిన్నారులపై మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుండగుడు.. అనకాపల్లి జిల్లాలో రాత్రి 2 గంటల సమయంలో అక్కాచెల్లెలు బహిర్భూమికి వెళ్లారు. దీంతో.. బయటకు వచ్చిన సమయంలో బాలికను లాక్కెళ్లి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరో చెల్లిని ఎత్తుకుపోయారని తల్లిదండ్రులకు బాలిక వచ్చి చెప్పింది. దీంతో హుటాహుటినా…
పెద్ద చదువులు మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక వర్గ చరిత్రను, రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని సీఎం జగన్ అన్నారు. నేడు సీఎం జగన్ 10.85 లక్షల మంది పిల్లలకు విద్యాదీవెన ద్వారా వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. చదువులు అన్నవి పిల్లలకు మనం ఇచ్చే ఆస్తులు అన్నారు. చదువును ఎవ్వరూ కూడా దొంగతనం చేయలేని ఆస్తి అని, మన తలరాతను మార్చే శక్తి…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్వంతగా పార్టీ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. ఢిల్లీలో నేడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాలూ, నితీష్ పరిపాలనలో బీహార్ అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. రాబోయే పది, పదిహేను ఏళ్లలో బీహార్ “ప్రగతిశీల రాష్ట్రంగా” ఎదగాలంటే ఇప్పుడున్న దారిలో వెళితే సాధ్యం కాదు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం ద్వారానే ఇది సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.…
ఈ రోజు తెల్లవారుజామున ఒక్క సారిగా కురిసిన భారీ వర్షం, గాలుల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని సీజీమ్, సూపరింటిండెంట్ ఇంజినీర్లతో సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలపై కూలిన చెట్ల మూలాన విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని ఆయన అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రఘుమా…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. బుధవారం వేకువజామున్న ఒక్కసారిగా ఈదురు గాలులతో కుండపోత వర్షం కురియడంతో చెట్లు నేలకొరిగాయి. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం నీటి మునిగి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి క్షేత్రంలో కూడా భారీ వర్షం కారణంగా ఆలయ క్యూలైనల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా గుట్టపైకి వెళ్లేందుకు నిర్మించిన నూతన ఘాట్ రోడ్ భారీ వర్షానికి కోతకు గురైంది.…
రోజురోజుకు ఇంధన ధరలు పెరగిపోతుండడంతో వాహనాదారులపై పెనుభారం పడుతోంది. అయితే పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. అయితే.. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 18 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.119 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.105.02 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో 15 పైసలు తగ్గడంతో…
గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం మద్యం అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బీర్ కేసులు 23 లక్షలు అధికంగా అమ్ముడైనట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. భానుడి ప్రభావానికి మందుబాబులు బీర్లను ఎక్కువగానే తాగేశారు. అయితే.. గత ఏప్రిల్ లో కన్నా ఈ ఏప్రిల్ లో 420 కోట్ల ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఏప్రిల్ నెలలో డిపోల నుండి మద్యం అమ్మకాలు 2…
ఈనెల 14న ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ వివాహం చేసుకోవలసిన విజయ అనే అమ్మాయి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. బీజేపీ నాయకుడు సాయి గణేష్-విజయల వివాహం మే 4 తారీఖున జరగవలసి ఉంది. అయితే పోలీసుల వేధింపుల వల్ల సాయి గణేష్ ఈనెల 14వ తేదీన త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఆత్మహత్య యత్నం చేసుకోగా 16వ తేదీన మృతి చెందాడు. ఈ సంఘటనపై ఇప్పటికే అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.…
తెలంగాణ సర్కార్ వరుసగా నోటిఫికేషన్‌లను విడుదల చేస్తోంది. ఇప్పటికే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ, గ్రూప్-1 నోటిఫికేషన్‌ను ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తాజాగా ఎక్సైజ్, రవాణా శాఖలో 677 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో.. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్(ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల 614కు నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థుల నుంచి మే…