Nizamabad MLC Kalvakuntla Kavitha Says Ugadi Wishes to Telangana People.
తెలంగాణ ప్రజలకు నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శ్రీశుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగాది పచ్చడిలో ఉన్న తీపి, పులుపు, ఒగరులా జీవితంలో కూడా సుఖదుఃఖాల ఉంటాయన్నారు. ఈ ఉగాది ప్రతి వారి జీవితంలో మరింత శుభాన్ని కలిగించాలని ఆమె కోరారు. అంతేకాకుండా తెలుగువారందరికీ ఇది శ్రీశుభకృత్ నామసంవత్సరాది అయితే.. తెలంగాణ యువతకు మాత్రం ఇది ఉద్యోగ నామ సంవత్సరం అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్ 90 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారన్నారు. అంతేకాకుండా ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న వారు టీషాట్ ఛానెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని.. టీషాట్‌లో ఎంతో విలువలతో కూడిన సెలబస్ అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఉగ్యోగార్థులు టీషాట్ ద్వారా మరింత ముందుకు వెళ్లగలుగుతారన్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. pic.twitter.com/LSx6csOoPf
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 1, 2022