టీఆర్ఎస్, బీజేపీ లపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినని వీరభద్రం తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు సేవ.. పనులు చేస్తే ఓట్లు.. సీట్లు వచ్చేవని, ఓట్లు సీట్లు తెచ్చుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కరోనా టైం లో ఒక్క ఐసోలేషన్ కేంద్రం అయినా పెట్టరా..? అని ప్రశ్నించారు. మేము పేదల కోసం ఐశోలేషన్ కేంద్రాన్ని పెట్టాం..గర్వంగా చెప్తాం అని ఆయన అన్నారు. మేము ఓట్లు.. సీట్లు గెలుచుకోవడంలో వెనక పడ్డాం నిజమే.. ఓట్లు వచ్చినా.. సీట్లు రాకపోయినా…
దేశంలో అంతా మోడీ మహల్ సేల్ నడుస్తుందని.. అన్నిటినీ అందులో అమ్మకానికి పెట్టారంటూ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శలు గుప్పించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఇదంతా ప్రజల సంపద.. మోడీ అయ్య జాగీరు కాదు అమ్మడానికి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. మోడీ హవా నడుస్తుంది మనం ఏం చేయగలం అనుకోకండి.. రైతులు ఢిల్లీ నీ ముట్టడించి.. చట్టాలు వెనక్కి తెచ్చేలా చేయలేదా..? మనం చూడలేదా ..? అని ఆమె మాట్లాడారు. తెలంగాణలో పొడు…
కరోనా పట్ల తన నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం నింపేందుకు పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ -19 బారిన పడిన పలువురితో మాట్లాడి, ధైర్యంగా ఉండాలని కోరారు. కోవిడ్-19 రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం మరియు ఆయన స్వయంగా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఫీవర్ సర్వే సందర్భంగా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. “మీరు తప్పనిసరిగా మెడికల్ కిట్ తీసుకోవాలి…
గాజులరామారంలో స్పోర్ట్స్ పార్కుతో పాటు ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్కు, చింతల్ భగత్‌సింగ్ నగర్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను వచ్చే వారంలో ప్రారంభించనున్నారు. ఈ సౌకర్యాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్‌పల్లి జోన్‌లో ఉన్నాయి. ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అన్ని వయసుల వారికి వినోద సౌకర్యాలను అందిస్తుంది అని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లండించారు. టీఎస్‌ఐఐసీ ఏరియా, గాజులరామారం వార్డులోని స్పోర్ట్స్ పార్కును కూడా జీహెచ్‌ఎంసీ రూ.198.50 లక్షలతో నిర్మించింది. భగత్ సింగ్ నగర్ లో…
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడింది.శనివారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో లతా మంగేష్కర్ కు చికిత్స చేస్తున్న డాక్టర్ ప్రతిత్ సమదానీ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వెల్లడించారు. “గాయని లతా మంగేష్కర్ ఇప్పటికీ ఐసీయూలో ఉన్నారు, కానీ ఈ రోజు ఆమె ఆరోగ్యంలో స్వల్ప మెరుగుదల ఉంది. ఆమెను ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ”అని డాక్టర్ పేర్కొన్నారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని లతా…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గిరిజన మహిళలపై విచక్షణ రహితంగా ఓ అటవీ శాఖ అధికారి వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జిల్లాలోని ములకలపల్లి మండలం సాకివలస గ్రామంలో ఆదివాసీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఫారెస్ట్ బీట్ గార్డు మహేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు పోటు రంగారావు డిమాండ్ చేశారు. కట్టెలు కొట్టేందుకు అడవికి వెళ్లిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ గార్డు దాడికి…
ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం వీఎం బంజర్‌లో కుమారుడి అంత్యక్రియల సందర్భంగా హెల్మెట్ వినియోగించాలంటూ ఓ తండ్రి చేసిన విజ్ఞప్తి అందరినీ కలచివేసింది. ఖమ్మం బస్టాండ్ సమీపంలో జనవరి 8న జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఎం బంజర్ గ్రామం వద్ద సోమ్లానాయక్ తండాకు చెందిన తేజావత్ సాయి(18) తలకు బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అంతిమయాత్రలో ఉన్న యువకుడి తండ్రి తేజావత్ హరి తన కుమారుడి మృతితో భావోద్వేగానికి లోనయ్యారు.…
గుడివాడలో జరిగిన ఘటనలో కుట్రకోణం ఏమైనా ఉందా అనే అంశంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు వెల్లడించారు. రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ఆరుగురు సభ్యులతో టీడీపీ నిజ నిర్ధారణ కమిటీకి అనుమతి ఇచ్చామని, కానీ నిబంధనలు అతిక్రమించి వందలాది మందితో టీడీపీ నాయకులు వచ్చారన్నారు. గుడివాడలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను కృష్ణా జిల్లా పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ, చాకచక్యంగా అదుపు చేశారని…
ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఏకమై పీఆర్సీ సాధన సమితి పేరిట ఉద్యమాన్ని ప్రారంభిచనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమితి నేతలు సీఎస్ సమీర్ శర్మతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సీఎస్ కు విజ్ఞాపన పత్రాన్ని పీఆర్సీ సాధన సమితి నేతలు అందజేశారు. కొత్త పీఆర్సీ అమలు అంశాన్ని అబయెన్సులో పెట్టాల్సిందిగా సీఎస్ కు ఇచ్చిన…
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని.. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని కోరుతూ మళ్లీ సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ లోని సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతల భేటీ అయ్యారు. పీఆర్సీ సాధనా సమితి పేరుతో ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఎన్జీవో హోంలో సమావేశానికి కొనసాగింపుగా అప్సా కార్యాలయంలో నేతల సమావేశం నిర్వహించారు. సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు…