వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటన గుంటూరు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. నిన్న వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ఘటనలో పోలీసులు ఇద్దరు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. దీంతో వారి అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ నేత అరవింద్ బాబు ధర్నా చేపట్టారు. పోలీసులు అరవింద్ బాబు ధర్నా చేపట్టిన స్థలానికి చేరుకొని ధర్నా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో అరవింద్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.…
నిన్న వైఎస్సాఆర్ విగ్రహం ధ్వంసమైన ఘటన వివాదం రేపుతోంది. అయితే వైఎస్సాఆర్ విగ్రహ ధ్వంసం ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టాలని నరసరావుపేటలోని జొన్నలగడ్డలో టీడీపీనేత అరవింద్ బాబు టీడీపీ కార్యకర్తలతో ధర్నా దిగారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అరవింద్ ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్నారు. అయితే ధర్నా విరమించాలని అరవింద్‌ను పోలీసులు కోరగా అరవింద్‌కు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.…
పోలీసులపై పేకాటరాయుళ్లు దాడి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. భీమడోలు మండలం గుండుగొలనులో నిన్న అర్థరాత్రి పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే పోలీసులు దాడులు నిర్వహించడంతో పేకాటరాయుళ్లు తిరుగబడి పోలీసులపైనే దాడులు చేశారు. ఈ దాడిలో పోలీసులు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసుల నమోదు చేసుకున్నా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడిచేసిన నిందితులు ఏలూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. నిందితులు…
పసిఫిక్ ద్వీపకల్పం టోంగాలో అగ్నిపర్వతం బద్దలైంది. సముద్రం అడుగున ఉన్న భారీ అగ్నిపర్వతం పేలింది. దీంతో హవాయి, అలస్కా, యూఎస్ పసిఫిక్ కోస్ట్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అగ్ని పర్వతం విస్ఫోటనం తర్వాత భారీగా పొగ, బూడిద ఎగిసిపడుతోంది. టోంగా రాజధాని నుకులోఫాలో 12 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ తీరానికి అమెరికా వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సునామీ హెచ్చరికల దృష్ట్యా యూఎస్ పశ్చిమ తీరంలోని బీచ్‌లు…
ఈ రోజు ఉదయం 10.30 గంటలకు స్టార్టప్‌ల ప్రతినిధులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరు అంశాలపై స్టార్టప్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. జనవరి 16ను జాతీయ అంకుర దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. అంకుర సంస్థలు నవ భారతానికి వెన్నెముకగా మారనున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశంలో కోసం ఆవిష్కరణలు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా భారతదేశం నుంచి ఆవిష్కరణలు చేద్దామన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలోనూ అంకుర…
నిశీది వేళలో సైతం నిద్రించని భాగ్యనగరం ఇప్పడు బోసిపోయింది. సంక్రాంతి పండుగ వేళ.. పట్నంవాసులు పల్లెలకు పరుగులు తీశారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు మహానగరంలో ఉరుకుల పరుగుల జీవితాన్ని గడిపి.. సంక్రాంతి పండుగకు సొంతూళ్లో బంధుమిత్రులతో గడిపేందుకు ప్రజలు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ఎప్పడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యంగా తయారయ్యాయి. అటు ఏపీకి చెందిన వారు ఆంధ్రాకు పయనమైతే.. ఇటు తెలంగాణలోని వారి సైతం తమ ఊర్లకు…
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను తెలుగురాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు.. ఘుమఘుమలాడే పిండివంటలు, పిల్లల ఆటపాట, గాలిపటాల హుషారుతో ఇళ్లంతా కోలాహలంగా మారిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తెలుగింటి లోగిళ్లు రంగవల్లులతో దర్శనమిస్తున్నాయి. ఉదయాన్నే లేచేసరికి చలిగాలి పలకరింపుతో పులకరించి, పుణ్యస్నానాలచరించి కొత్తబట్టలు వేసుకొని చిన్నాపెద్దా తేడాలేకుండా హుషారుగా…
ఇటీవల కేంద్రం ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర నిర్ణయంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దేశానికి అన్నం పెట్టే రైతును ఇంత గోస పెడతారా…? పండగ పూట ఎరువుల ధరలు 50% నుండి 100% కు పెంచుతారా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక దుర్మార్గపు చర్యలను ఎక్కడికక్కడ నిలదీయాలని, రాష్ట్ర బీజేపీ నాయకులు పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని తమ కేంద్ర నాయకత్వాన్ని…
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోన్న వేళ సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జీ పరిటాల శ్రీరామ్‌కు కరోనా సోకినట్లు ఆయన వెల్లడించారు. అయితే స్వల్పలక్షణాలతో ఆయన కరోనా పాజిటివ్‌గా తేలిందని, ఇటీవల తనను కలిసివారందరూ జాగ్రత్తగా ఉండండని ఆయన తెలిపారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే.. కరోనా రక్కసి రెక్కలు చాస్తోంది. దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్…
సింహాద్రి అప్పన్నను శ్రీశారదాపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భగుడిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి మంటలు వెలిగించి స్వామిజీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సారి భోగి, సంక్రాంతి, కనుమకు ముందురోజు వైకుంఠ ఏకాదశి రావడం ఎంతో అదృష్టమని ఆయన అన్నారు. అదేవిధంగా భోగి మంటలు ఈ మంచి సమయంలో ప్రారంభించడం మహాత్భాగ్యంగా భావిస్తున్నాననన్నారు. ముఖ్యంగా ఈ…