తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి పట్టుబడిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా మద్యం సేవించి పట్టుబడిన వారి వెంట మద్యం సేవించనివారేవరైనా ఉంటే వారికి వాహనాన్ని అప్పగించాలని సూచించింది. మద్యం తాగిన వారి వెంట ఎవరూ లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులను పిలిచి వాహనం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఎవరూ రాకపోతే వాహనం పీఎస్‌కు తరలించి తర్వాత అప్పగించాలని వెల్లడించింది.