సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పేర్ని నానికి సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటికే మంత్రి పేర్ని నాని రవాణా, సమాచార శాఖ బాధ్యతలు చూస్తున్నారు. అయితే ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయం హాట్ టాపిక్‌గా మారాయి. టికెట్ల ధరలు పెంచడం కుదరదని ఇటీవల ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టింది. పెద్ద, చిన్నా అని తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలు వర్తిస్తాయని జీవోలో పేర్కొంది. అయితే ఏపీ ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేస్తూ.. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు టికెట్లపై నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తే ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. అయితే డివిజన్ బెంచ్‌లో విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల ధరలన విషయలో విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ క్రమంలో మంత్రి పేర్ని నానికి సినిమాటోగ్రఫీ శాఖను సీఎం అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.