2023 సంవత్సరంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ 2023 నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మంచి ఆశయాలను కలిగి, వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈసంవత్సరం రాష్ట్రంలో పాడి-పంటలు సమృద్ధిగా పండాలని, పండిన పంటకు గిట్టుబాటు ధర పొంది రైతులు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
TIrumala: రేపటి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
ఈ సంవత్సరమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేయకుండ ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం పని చేయాలన్నారు. రాష్ట్రంలో కరోనా విస్తరించే ప్రమాదం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేయకుండ ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు సైతం స్వీయరక్షణ పాటించి కరోనాకు చెక్ పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఈ ఏడాదిలో కృషి చేయాలని కోరారు.