Bhatti Vikramarka: ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. సచివాలయం ప్రారంభం అనంతరమే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం ఉందంటూ ప్రచారం జోరుగా ఉంది.. దీంతో అన్ని పార్టీలు ఇప్పటినుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. గత వారం రోజులుగా ఆయన పాదయాత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. ఇక త్వరలోనే తాను కూడా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేస్తానని ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తాజాగా తాను కూడా పాదయాత్ర చేయబోతున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కవెల్లడించారు.
Read Also: Australian MPs meet CM Jagan: సీఎం జగన్ తో ఆస్ట్రేలియా ఎంపీల బృందం భేటీ
ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని వెల్లడించిన భట్టి విక్రమార్క.. ప్రజల్లోకి వెళ్లడానికి ఇంకా సరిపడేంత సమయం ఉందని వ్యాఖ్యానించారు.బడ్జెట్ సమావేశాల కారణంగా ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అనడం అవివేకమని భట్టి విక్రమార్క అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి సభలో కేసీఆర్ వాస్తవమే మాట్లాడారని చెప్పారు. కాళేశ్వరంతో పాటు అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. అసెంబ్లీ సమావేశాల కారణంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనలేదని.. త్వరలోనే తనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే ఆయన పాదయాత్రలో పాల్గొంటామని అన్నారు.