సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనల పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సివిల్ సప్లై శాఖ బడ్జెట్ ప్రిపరేషన్ పై చర్చ జరిగిందని అన్నారు. పేదవాడికి బియ్యం సప్లై చేసే శాఖ పై గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 2014-15లో రూ.383 కోట్లు ఏరియర్స్ ఉంటే..…
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్లు, భవనాలు, రైల్వే బ్రిడ్జిలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం కేటాయింపులు పేపర్లలో చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని.. పదిసార్లు టెండర్లు పిలిచినా, పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి…
ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలని సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
ప్రజలపై భారం మోపకుండ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుదామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ అండ్ పిఆర్, ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్తులు సృష్టించి, సృష్టించిన ఆస్తులతో వచ్చిన ఆదాయం…
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆసుపత్రి వైద్యులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. తమ్మినేని గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం వెంట మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ…
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా కింద పోటీ చేసే పార్టీ అభ్యర్థులను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది . తెలంగాణ శాసనమండలికి జరిగే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికయ్యే అభ్యర్థులుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీ మహేశ్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ల అభ్యర్థిత్వ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారు . నామినేషన్ల చివరి రోజైన జనవరి 18న ఇరువురు నేతలు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మహేశ్ కుమార్…
ఇందిరమ్మ ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపు కోవాలని, సంక్రాంతి పండుగ రైతుల జీవితాలతో పాటు ప్రజలందరికి నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోగీ, సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. వరి ధాన్యం ఇంటికి చేరిన వేళ బందు మిత్రులతో, పశు పక్షాధులతో సంతోషంగా జరుపుకునే పండుగ ప్రతి ఇంట్లో…
హైదరాబాద్ వయా మిర్యాలగూడ -విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయన కార్యాలయంలో శనివారం…
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజా పాలన సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఐదు గ్యారంటీల అమలు కోసం సుమారు రెండున్నర గంటల పాటు ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రజా పాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి?. డాటా ఎంట్రీ ఎంత వరకు పూర్తయింది?. ఐదు గ్యారంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో గ్యారెంటీ వారిగా వచ్చిన అభ్యర్థనలు ఎన్ని? అనే దానిపై చర్చించారు.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఇంత జాప్యానికి కారకులు ఎవరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన.. ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వితో కలిసి బీహెచ్ఈఎల్ అధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్‌పై సమీక్షించారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 అక్టోబర్ నాటికి రెండు యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో మూడు యూనిట్లు పూర్తి చేసుకొని మొత్తం 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణం ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉండటానికి…