Hydrabad ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ ఉన్న హెచ్‌ఎండీఏకు చెందిన ఖాళీ స్థలంలో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను సృష్టించేందుకు టౌన్‌షిప్‌లు నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.. 2024-25 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ చేసిన ప్రతిపాదనలను సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో హెచ్‌ఎండీఏ కీలక పాత్ర పోషించాలన్నారు. ఓఆర్‌ఆర్ చుట్టూ టౌన్‌షిప్‌ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నారు. మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న రోడ్ల విస్తరణ ఏ మేరకు జరిగిందో గుర్తించాలని సూచించారు.
Read also: Males Special Bus Stopped: మూడు రోజుల మచ్చటేనా ?.. నిలిచిపోయిన ‘మేల్స్ స్పెషల్’ బస్సు
దీని ద్వారా ఇళ్లను నిర్మించి తర్వాత తొలగించాల్సిన అవసరం ఉండదు. లేఅవుట్లలో తనఖా పెట్టిన ప్లాట్లను అభివృద్ధి చేయకుండా వదిలేస్తున్నారని.. వాటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎల్ ఆర్ ఎస్ కింద వచ్చిన 39 లక్షల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వేలం ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లు వినియోగించకుంటే వెనక్కి తీసుకోవాలి. అది కుదరకపోతే ప్రభుత్వ వాటా దక్కించుకోవాలన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులను ఒక్కో సందర్భంలో నమోదు చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులను ఆదేశించారు. ఓఆర్‌ఆర్ చుట్టూ టౌన్‌షిప్‌ల నిర్మాణంతో ఆ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఆ ప్రాంతాలు ఇప్పటికే రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి చెందుతుండగా.. ప్రభుత్వ నిర్ణయంతో భూములకు రెక్కలు రానున్నాయి.
Traffic Restrictions in Eluru: రేపు ఏలూరులో సీఎం పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు విధింపు.. ఎవరు ఏ రూట్లో వెళ్లాలంటే..?