సచివాలయంలోని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఆరు గ్యారెంటీల అమలు, మార్గదర్శకాలపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా.. ఈ నెల చివరి నాటికి అభయ హస్తం దరఖాస్తులు ఆన్లైన్లో ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంత మంది లబ్దిదారులన్న దానిపై క్లారిటీ రానుంది. ఈ నెల చివరిన లేదా వచ్చే నెలలో…
Kadiyam Srihari: పొంగులేటి తానే నెంబర్ 2 అంటున్నారు ..భట్టి కి సీఎం పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ… రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ను తప్పుదోవ పట్టించారా లేదా.. అని చెన్నమనేని ప్రశ్నించిన హైకోర్టు… కోర్టు ను తప్పుదోవ పట్టించునే వాళ్లకు ఉపషమనం ఎందుకు కల్పించాలని వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జర్మనీ పౌరసత్వం తో పోటీ చేసారన్న హైకోర్టు.. జర్మనీ పౌరసత్వం తోనే ఇంకా ప్రయాణాలు చేస్తున్నారా…
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ప్రజా యుద్ధనౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను భట్టి విక్రమార్క పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరుతో ప్రజా పాలన అభయహస్తం కోసం దరఖాస్తు చేశారు. ఈ ఫాంలో కొడుకులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల పేర్లు రాసి ఉంచారు. ఇక, కూతురుగా కొండా సురేఖ, అల్లుడుగా శ్రీధర్ బాబు పేర్లు రాసి ప్రజాపాలనలో అభయహస్తంకు సదరు ఆకతాయిలు దరఖాస్తు ఇచ్చారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
జరిగిన ఆర్థిక అరాచకత్వం – కొద్ది మంది ప్రయోజనాలు, ప్రాపకం కోసం చేసిన వాటిని సరిచేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ – రేసింగ్ వల్ల ఒకరు టికెట్లు అమ్ముకున్నారు, మరొకరు రేసింగ్ చేసుకున్నారు మరి ఇన్ఫ్రాసట్రక్చర్ ఇచ్చిన రాష్ట్రానికి ఆదాయం సున్నా అన్నారు భట్టి. ఈ ఫార్ములా ట్రై పార్టీ రేసింగ్ ను – బై పార్టీ రేసింగ్ గా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. టికెట్లు అమ్మేవాళ్లు, రేసింగ్…
సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన రాధే, అంతిమ్, కిసీ కా బాయ్ మరియు కిసీ కా జాన్.. వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. గత ఏడాది సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్…
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారిని మన రాష్ట్రం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కోరినమని, సోనియా గాంధీ పోటీ చేసే పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయవద్దన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలని, బీఆర్ఎస్ పార్టీకి కాలేశ్వరం ఏటీఎం లాగా మారిందని ప్రధానమంత్రి మోడీ హోం మంత్రి…
Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు, రేపు (శని, ఆదివారం) పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 6 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి బయలుదేరి ఉదయం 10:30 గంటలకు మధిర నియోజకవర్గం..
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థల సామర్ధ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంచనాల ప్రకారం 2031-32 నాటికి పెరగనున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని ఆయా వ్యవస్థల సామర్థ్యం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర విద్యుత్ శాఖపై గురువారం ఆయన సచివాలయంలో…