Bandi Sanjay: బండి సంజయ్ ఏం చేశాడని అంటున్నవారికి సమాధానమే ఈ ప్రజాహిత యాత్ర అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి ప్రజాహిత యాత్రలో ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావాలంటే 5 లక్షల కోట్లకుపైగా అవసరమన్నారు. బడ్జెట్ లో హామీల అమలు కోసం కేటాయించిన నిధులు 53 వేల కోట్లు మాత్రమే అన్నారు. బడ్జెట్ సాక్షిగటా బీసీలను దారుణంగా వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయిస్తామని హామీని పూర్తిగా విస్మరించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతనేలేదన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేమని బడ్జెట్ సాక్షిగా చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పీవీ నర్సింహారావును దారుణంగా వంచించిన పార్టీ కాంగ్రెస్.. పీవీ చనిపోతే కనీసం ఢిల్లీలో అంత్యక్రియలు కూడా జరపని నీచమైన పార్టీ కాంగ్రెస్.. పీవీ ఘాట్ ను కూల్చేస్తామని మజ్లిస్ వార్నింగ్ ఇస్తే కనీసం నోరుమెదపని పార్టీ కాంగ్రెస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ ఘాట్ పై చేయి వేస్తే దారుస్సలాంను కూల్చేస్తానని వార్నింగ్ ఇచ్చిన పార్టీ బీజేపీ అన్నారు.
బండి సంజయ్ కు అండగా మోదీ, రాముడు ఉన్నడని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాన రజాకార్ల పార్టీ, రాక్షసుల పార్టీ అండగా ఉందన్నారు. రామరాజ్యం కోసం తపిస్తున్న మోదీ పాలన కావాలా?… రజాకార్ల రాక్షసులకు వత్తాసు పలుకుతున్న రాహుల్ పాలన కావాలా? నిరంతరం ప్రజల కోసం పోరాడే బండి సంజయ్ కావాలా?… విహార యాత్రల మాదిరిగా అప్పడప్పుడు వచ్చే నేతలు కావాలా? రాముడి వారసుల పార్టీ కావాలా?…. రాక్షస వారసుల పార్టీలు కావాలా? దేవుడిని నమ్మే బీజేపీ కావాలా?…. దేవుడిని నమ్మకుండా హేళన చేసే పార్టీలు కావాలా? అని ప్రశ్నించారు. పేదల కోసం యుద్దం చేస్తున్న బండి సంజయ్ ను గెలిపించండని తెలిపారు. నరేంద్రమోదీని మళ్లీ ప్రధాని చేసేందుకు అందరం కంకణం కట్టుకుందామన్నారు. అందుకే ప్రజా హిత పాదయాత్ర ప్రారంభిస్తున్నా అన్నారు. నిండు మనసుతో ఆశీర్వదించి ప్రజాహిత యాత్రను విజయవంతం చేయండన్నారు. రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తారని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి రామ మందిరం నాది అని ప్రతి హిందువు గర్వపడేలా చేసిన మోదీ అన్నారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అంటూ హిందువుల మనోభావాలను కాంగ్రెస్ హేళన చేస్తోందన్నారు. కాంగ్రెస్ నేతలకు కావాలంటే బాస్మతి బియ్యంతో చేసిన అక్షింతలను పంపేందుకు సిద్ధమన్నారు. నిన్నటిదాకా అయోద్య రామమందిర నిర్మాణాన్ని హేళన చేసిన బీఆర్ఎస్ నేతలకు ప్రజా తీర్పుతో బుద్ది వచ్చిందన్నారు.
Read also: Bhatti Vikramarka: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. మాకు కొంత అయిష్టంగానే ఉంది
అయోధ్యలో రామ మందిర నిర్మాణం సరైనదేనని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చిలకపలుకులు పలుకుతున్నారన్నారు. అయోధ్యలో రాముడి పుట్టారనడానికి ఆధారాలేమిటని కాంగ్రెస్ నేతలు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు వాళ్ల అమ్మ కడుపులో పుట్టారనడానికి ఆధారాలేమిటి? అక్కడున్న డాక్టర్లు, నర్సులు చెబితేనే కదా తేలిసేది? అని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ప్రజల కష్టాలను తెలుసుకుని భరోసా ఇచ్చిన పార్టీ బీజేపీ అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ మోదీ కులంపై ప్రశ్నించడం సిగ్గుచేటన్నారు. రాహుల్ గాంధీ అసలు పేరు రౌల్(తోడేలు) విన్సీ, మోదీ కులం భారతీయత… మోదీ మతం హిందూ మతం అన్నారు. రాహుల్ పప్పు… అసలు మీ కులమేంది? మీ మతమేందో చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. మీ తాత ఫిరోజ్ ది ఏ కులం, ఏ మతం? మీ అమ్మది ఏ దేశం, ఏ మతం, ఏ కులం? నరేంద్రమోదీ అందరి వాడు. ఈ దేశాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్న మహనీయుడన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో బాబ్రీమసీదు కడతారని తెలిపారు.
రాముడి గుడి కావాలా? బాబ్రీ మసీదు కావాలా?.. ప్రజలారా తేల్చుకోండన్నారు. కేసీఆర్ పనైపోయింది…తాంత్రిక పూజలకు నిలయమైన ఫాంహౌజ్ కు ఎవరూ వెళ్లే సాహసం చేయడం లేదన్నారు. నేను చచ్చిపోవాలని, కాళ్లు చేతులు పడిపోవాలని కేసీఆర్ తాంత్రిక పూజలు చేసిండని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఇతరుల నాశనం కోరుకుంటే చివరకు వాళ్లే నాశనమైపోతారన్నారు. బండి సంజయ్ ఏం చేశాడని అంటున్నవారికి సమాధానమే ఈ ప్రజాహిత యాత్ర అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివ్రుద్ధి నిధులన్నీ మోదీ ప్రభుత్వానివే అన్నారు. నేను నా జీవితాన్ని ప్రజల కోసమే ధారపోస్తున్నా అని తెలిపారు. నాకు సొంత వ్యాపారాల్లేవు… కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిరిగా దోచుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు పొందిన సంస్థను వినోద్ బెదిరించి తన వాళ్లకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది నిజం కాదా? ఆ సంస్థ చేసిన పనులవల్లే ఇయాళ మేడిగడ్డ పిల్లర్లు వంగిపోవడం నిజం కాదా? అని ప్రశ్నించారు. స్వయం ప్రకటిత మేధావి దమ్ముంటే గుండెమీద చేయివేసి నిజం చెప్పాలన్నారు.
Virat Kohli: ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే.. విరాట్ కోహ్లీపై నా దృష్టిపడింది!