ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబిక అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, మేఘా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శ్రీశైల మల్లికార్జున దర్శనం చేసుకున్నారు.
నేటి నుంచి లోక్ సభ సమావేశాలు.. నీట్ పరీక్షపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం రెడీ 18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం (జూన్ 24) నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్సభ మొదటి సెషన్లో మొదటి రోజు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటు కాంప్లెక్స్లో సమావేశమై సభ వైపు కలిసి కవాతు చేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు లోక్సభ ప్రొటెం…
Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు రోడ్డు మార్గంలో నల్లమలలోని శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది.
Mallu Bhatti Vikramarka: మూసీ అభివృద్ధి పథకానికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో రాష్ట్రం తరపున పలు అంశాలను ప్రస్తావించారు.
Mallu Bhatti Vikramarka: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవకాశం ఇస్తే అఖిల పక్షంగా వచ్చి ప్రధానిని కలుస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు 10వ బొగ్గు వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.
Bhatti Vikramarka: హైదరాబాద్ నగరంలోని ప్రజా భవన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు విషెస్ చెబుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏపీలో విలీనమైన ఐదు టీఎస్ గ్రామాల భవితవ్యంపై వైఖరి చెప్పాలని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కోరింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సాంకేతికతను అందిపుచ్చుకుని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఎన్ఎస్ కెనాల్ కాలనీ…
ఈనెల 18 నుంచి శాఖల వారీగా బడ్జెట్ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీ లతో భేటీ కానున్నారు. ఈనెల18న వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేతశాఖల ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఈనెల 21న రెవెన్యూ, గృహనిర్మాణం, ఐఅండ్ పీఆర్, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమం, వైద్య-ఆరోగ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈనెల 22న ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ, ఐటీ, పరిశ్రమల శాఖ పై…
తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వివిధ శాఖల సమీక్ష సమావేశం ఆయన నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్షలో భాగంగా…