రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు 09-12-2023 తేదీ నాటికి…
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఒడిశా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీతో ఆయన భేటీ అయ్యారు. ఒడిశాలో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైనీ బొగ్గు బ్లాక్ తవ్వకాలకు కావాల్సిన అనుమతుల గురించి ఆ రాష్ట్ర సీఎంతో చర్చించారు.
క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి పూర్తిస్థాయి మార్గదర్శకాలతో ‘రైతుభరోసా’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి అదిలాబాద్ జిల్లా రైతుల నుండి అభిప్రాయాలు, సలహాలను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది.
ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకంపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ర్ట వనరులు, సంపద ప్రజలకే పంచుతామన్నారు. రైతు బంధు పేరుతో ఒకే సారి నిధులు విడుదల చేశామని, రైతు భరోసా అమలుకు బడ్జెట్ సమావేశం లో నిధులు కేటాయించనున్నామన్నారు భట్టి విక్రమార్క. శాసనసభ లో చర్చ కు పెడతామని,…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం భేటీ అయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలపై చర్చించారు. భేటీలో చర్చించిన అంశాలను కమిటీల ద్వారా విభజన సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ భేటీ అనంతరం తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈ సమావేశంలో అనేక అంశాలపై లోతుగా చర్చించామన్నారు. పదేళ్లుగా పరిష్కారానికి నోచుకోని కీలక అంశాలను…
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నివేదించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 51 వేల కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించింది PR&RD. అయితే.. గత బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి…
రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగం.. సభ నుంచి విపక్షాలు వాకౌట్ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ సమాధానమిచ్చారు. తన ప్రసంగంలో, ప్రధాని, ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, రైతుల రుణమాఫీ, మహిళా సాధికారత గురించి కూడా ప్రస్తావించారు. ప్రధాని మోడీ ప్రసంగం సందర్భంగా విపక్షాలు నినాదాలు చేశాయి. అనంతరం విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.…
ఇచ్చిన హామీల అమలు లోతుగా అధ్యయనం చేసి అమలులోకి తెస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నామని తెలిపారు. లక్ష రుణమాఫీ కి ఐదేళ్లు తీసుకుని.. అవి కూడా చేయని బీఆర్ఎస్ మాపై అరుస్తుందని ఆయన మండిపడ్డారు. మీరు అరిచి గీ పెట్టాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా మొత్తము వ్యవసాయం అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామన్నారు. మేము ఇచ్చే ప్రతి…