Budget Preparation Meeting : పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై బడ్జెట్ సన్నాహక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై బడ్జెట్ సన్నాహక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నివేదించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి 51 వేల కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించింది PR&RD. అయితే.. గత బడ్జెట్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కి 23 వేల కోట్లు కేటాయించారు. చేయూత కింద పింఛన్ల మొత్తాన్ని పెంచాలని PR&RD ప్రతిపాదనలు ఇచ్చింది. చేయూత పథకం కోసం 22 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఆసరా పెన్షన్ల కోసం 12 వేల కోట్లను ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. గ్రామీణ రహదారుల బడ్జెట్ ను రెట్టింపు చేయాలని ప్రతిపాదించింది PR&RD.
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
అయితే.. మహిళా స్వయం సంఘాల లోన్ బీమా, ప్రమాద బీమా కోసం అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ తో అన్ని ఆవాసాలను అనుసంధానం చేయాలని మంత్రి సీతక్క కోరారు. మిగిలిపోయిన అన్ని ఆవాసాలకు రక్షిత మంచి నీరు అందించేలా చర్యలు చేపట్టాలని, అడవుల్లో నివసించే ప్రజలకు సైతం కుళాయి నీళ్లు అందించాలన్నారు. అడవుల్లో విద్యుత్ లైన్లు వేసేందుకు కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇవ్వడం లేదని, అడవుల్లో వున్న ఆవాసాల్లో సోలార్ ప్లాంట్ లు ఏర్పాటు చేసి బోర్ల ద్వారా తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. నీటి సోర్స్ పాయింట్లు దగ్గర్లో ఉండేలా చూసుకోవాలని, గ్రామపంచాయతీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులను ప్రతి 15 రోజులకు శుభ్ర పరచాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగినీటినీ వినియోగించే విధంగా ప్రజలకు నమ్మకం కలిగించాలన్నారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!