అమెరికా పర్యటనలో మంత్రి నారా లోకేష్.. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో భేటీ అమెరికా పర్యటనలో ఉన్నారు మంత్రి నారా లోకేష్‌కు.. శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న లోకేష్‌కు అపూర్వ స్వాగతం లభించింది.. ఇక, అక్కడ పారిశ్రామికవేత్తతో సమావేశం అయ్యారు లోకేష్.. వై2కె బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఐటి శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందన్నారు నారా లోకేష్… శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో…
మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆలోచనలతో సీఎం, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉందన్నారు భట్టి విక్రమార్క. మూసీ నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్స్ నిర్మిస్తాం.. వారు సకల సౌకర్యాలతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామని, మూసీ నిర్వాసితుల పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తామని ఆయన తెలిపారు. నిర్వాసితులైన డ్వాక్రా మహిళలకు 1000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తాం.. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధిని కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్లో భారీ స్థాయిలో సైబర్ దాడులు.. అణుస్థావరాలే లక్ష్యంగా.. పశ్చిమాసియాలో ఘర్షణ వాతావరణంతో ప్రపంచమంతా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఈ సమయంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాన్లో ఈరోజు (శనివారం) భారీ స్థాయిలో సైబర్ దాడులు జరిగినట్లు తేలింది. దాంతో సర్కార్ లోని మూడు బ్రాంచ్‌ల (న్యాయ, శాసన, కార్యనిర్వాహక శాఖలు) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే, అణుస్థావరాలే టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. దీని వల్ల సమాచారం చోరీకి గురైందని…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో 36.5 కోట్లతో నిర్మించిన 2.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ ను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి విజయదశమి ఇది అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు విజయాలు పొందే విధంగా ప్రభుత్వం తరపున అండ గా ఉంటామని హామీ…
ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది.. ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పాఠశాల స్కూల్స్ బాగుకోసం కోట్ల రూపాయాలు కేటాయించామన్నారు. ఇప్పటికీ వున్న ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షన్సియల్ స్కూల్స్ కొనసాగిస్తామన్నారు. ఏవి కూడా ముసేసిది లేదన్నారు. అన్నింటికీ శాశ్వత భవనాలు కల్పిస్తామన్నారు. అడ్డంకులు సృష్టించేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఉడుత ఊపులకు ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదన్నారు. ఎవరు…
Minister Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగలపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు.
Revanth Reddy: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నేతలు నేడు ఉదయం కలిశారు. తెలంగాణలో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసారు బీసీ సంక్షేమ సంఘం నేతలు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు బీసీ సంక్షేమ సంఘం నేతలు. Also Read: Konda Surekha-KTR: మంత్రి కొండా సురేఖపై…
హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు.. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి, బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొత్తం 90 స్థానాల్లో 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉంటే, ఈ ఓటమిపై కాంగ్రెస్ మిత్రపక్షాలు, ఇండియా కూటమి పార్టీలు హస్తం పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అహంకారం, అతివిశ్వాసమే కాంగ్రెస్‌ని దెబ్బతీసిందని ఉద్దవ్ ఠాక్రే శివసేన ఆరోపించింది. టీఎంసీ…
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో.. ఇటీవల టీచర్లుగా ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అందచేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మిమ్మల్ని చూస్తోంటే దసరా పండగ మూడు…