ఇందిరాభవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం లో బిజీ షెడ్యూల్ ఉన్న.. తెలంగాణ కు రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు.
గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారు.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా అభివృద్ధిని గాలికి వదిలేశారని అన్నారు. సొంత జిల్లాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అభివృద్ధి చేశాడో చూస్తుంటే కనిపిస్తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారు.. ఎలాంటి…
అత్యున్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా తెలంగాణ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 200 కోట్ల రూపాయలతో స్కూల్ నిర్మాణం జరగబోతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో 35 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలు సందర్శించారు.
అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ఇటువంటి నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి.. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.…
ఈ దేశంలో, జార్ఖండ్ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని ఏఐసిసి సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శనివారం ఆయన జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్ గడ్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. సమావేశానికి ముందుగా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించి.. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు.
గాంధీభవన్‌లో బీసీ కులగణనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగుతున్న సమావేశంలో మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, కార్పొరేషన్ ఛైర్మన్లు పాల్గొన్నారు. ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు సమావేశంలో కులగణన ప్రాధాన్యతను వివరించారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల పలు సమీక్షలను నిర్వహించారు. సోమవారం మేధావులతో సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. మంగళవారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి వివరాలను సేకరించడంపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇందిరా డెయిరీని రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ఇందిరా డెయిరీ లోగో ఆవిష్కరణ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఉపముఖ్యమంత్రి మాట్లాడారు.