Bhatti Vikramarka : క్రోని క్యాపిటల్స్ నుంచి జార్ఖండ్ ను రక్షించండి
- క్రోని క్యాపిటల్స్ నుంచి జార్ఖండ్ ను రక్షించండి
- ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి
- ప్రజాస్వామ్యాన్ని కాపాడండి : భట్టి విక్రమార్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్ నుంచి జార్ఖండ్ కు విముక్తి కల్పించండి… ఇండియా కూటమి అభ్యర్థులను తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెయినర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం జార్ఖండ్ రాష్ట్రం రాంఘర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ మీటింగ్ లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. చిత్తార్పూర్ సీ,డీ బ్లాక్ రాజరప్ప బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఝార్ఖండ్ ప్రజల పోరాట స్ఫూర్తిని కొనియాడారు . డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఝార్ఖండ్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ఏఐసీసీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు .
మల్లిఖార్జున ఖర్గే నాయకత్వం లో రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా చేసిన జోడో యాత్ర తో దేశం లో ప్రజాస్వామిక శక్తులను ఏకం చేశారని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రెండు సందేశాలు ఈ దేశానికి ఇచ్చారని వివరించారు. విద్వేషాలను రగిలించే వారి చేతిలో ఈ దేశాన్ని పెట్టేందుకు మేము సిద్ధంగా లేము, విశాల భారతదేశంలో ప్రేమ అనే దుకాణం తెరిచి అన్ని జాతులు, మతాలకు సమాన అవకాశాలు ఇస్తామని సందేశం ఇచ్చారని వివరించారు. అదే సందర్భంలో ఈ దేశంలోని వనరులు, సంపద, ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశ ప్రజలకే చెందాలి తప్ప కొద్ది మంది క్రోనీ క్యాపిటల్ లిస్ట్ ల చేతిలో పెట్టేందుకు సిద్ధంగా లేమని సందేశం ఇచ్చారని తెలిపారు. అదాని, అంబానీ వంటి క్రోనీ క్యాపిటల్ లిస్ట్ ఈ దేశాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పోరాటం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే ఝార్ఖండ్ వనరులు రక్షించబడతాయని అన్నారు. ఈ దేశ సంపద జనాభా నిష్పత్తికి అనుగుణంగా పంపిణీ జరగాలి అంటే రాజ్యాంగాన్ని రక్షించుకొని ముందుకు పోవాలి అందుకు ఇండియా కూటమి అభ్యర్థుల ను గెలిపించడమే మన ముందు ఉన్న లక్ష్యం అని తెలిపారు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో జార్ఖండ్ రాష్ట్రాన్ని పెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తుందని చైతన్యం గల కాంగ్రెస్ కార్యకర్తలు ఝార్ఖండ్ రాష్టాన్ని, ఇక్కడి వనరులను ఆ దోపిడీ దారుల నుండి కాపాడు కోవాల్సిందిగా పిలుపు నిచ్చారు. ఝార్ఖండ్ ప్రజలు డబ్బుకు లొంగి పోయే రకం కాదని వాళ్ళకి వివేచన, విచక్షణ ఉందనీ ఆ పరంపరను కాపాడాల్సిందిగా పిలుపు నిచ్చారు. బ్లాక్, గ్రామ కాంగ్రెస్, పోలింగ్ బూత్ అధ్యక్షులు సమావేశమై విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఇండియా కూటమి ఇస్తున్న హామీలు, మేనిఫెస్టోను ఓటర్లకు పెద్ద ఎత్తున వివరించాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
రాంఘర్ అభ్యర్థి మమతా దేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని, అలాగే కూటమి అభ్యర్థులను అందరినీ గెలిపించాలన్నారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఏఐసీసీ నాయకులు గులాం అహమద్ మీర్ ,ఏఐసీసీ సెక్రటరీ సిరివెళ్ల ప్రసాద్, ఝార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కేశవ్ కమలేష్ మహతో, షహ్ నాజ్ అన్వర్ , మైనారిటీ సెల్ అధ్యక్షులు తారీక్ అన్వర్ ,షకీల్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, , స్థానిక నియోజక వర్గ నాయకులు, మండల ,గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.
Yogi Adityanath: ప్రతీ క్రిమినల్, రేపిస్ట్ ఎస్పీలోనే పుడుతాడు.. సీఈఓ అఖిలేష్ యాదవ్..
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?