Bhatti Vikramarka : ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుతో పాటు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. జాయింట్ వెంచర్స్‌లో విలువైన ఆస్తులు ఉన్నాయి.. ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లి వివాదాలు సృష్టిస్తున్నారన్నారు.
Kadiyam Srihari : తప్పకుండ వర్గీకరణ జరుగుతుంది, కానీ మనం ఓపికగా ఉండాలి…
ఈ అంశంపై నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. రామకృష్ణారావు అధ్యక్షతన మున్సిపల్, హౌసింగ్, లా సెక్రెటరీలతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీ సమావేశమై వారంలోగా సమస్యకు పరిష్కారం అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న ప్లాట్ల స్థితిగతులను సబ్ కమిటీ సమీక్షించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 5 ఎకరాల విస్తీర్ణంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రీయల్ పార్కు నిర్మించాలని పరిశ్రమల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
NCSC: మతం మారిన దళితులకు షాక్.. ఎస్సీ హోదా రద్దు చేసే అవకాశం?