Mallu Bhatti Vikramarka: ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు తీసే వారికి తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రపంచ స్థాయిలో భారత్ నిలబడడంలో ఇంధిరా గాంధీ పాత్ర కీలకం అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచిందన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత రవాణా కోసం నెలకు 400 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నామన్నారు. ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు తీసే వారికి బట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులు ఎత్తి నమస్కరిస్తారన్నారు. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా ఇందిరా గాంధీని నెగిటివ్ గా చూపిస్తున్నారని మండిపడ్డారు.
Read also: Ponnam Prabhakar: తెలంగాణలో అలాంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తెచ్చాం..
దేశ చరిత్రపై అవగాహన లేని వాళ్ళు కావాలని సినిమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నవాళ్లు ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా గాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాలు అందించారని తెలిపారు. కాళేశ్వరంతో పంట దిగుబడి పెరగలేదన్నారు. గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే దిగుబడి పెరిగిందన్నారు. మేడిగడ్డ..అన్నారం..సుందిళ్ళలో నీల్లే లేవు.. కిందికి వదిలేస్తున్నామన్నారు. కానీ ఈ సారి కూడా వరి దిగుబడి పెరిగిందన్నారు. బీఆర్ఎస్ చెప్పిన దానికి.. వాస్తవానికి తేడా ఉందన్నారు. ధరణి నీ సెట్ చేస్తున్నామన్నారు. రైతులకు ఉన్న ఇబ్బందులు తొలగిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వం ఎప్పుడూ రైతుల పక్షపాతి అన్నారు. 18 వేల కోట్ల రుణమాఫీ ఒకే రోజు చేసిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. పార్టీ నాయకులు జనంలో విస్తృత ప్రచారం చేయాలన్నారు.
TG Weather: పెరుగుతున్న చలి తీవ్రత.. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు..