Bhatti Vikramarka: రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్ని ఒడిదుడుకులు అయినా ఎదుర్కొంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థుల భవిష్యత్త్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు పాలించి మెస్ ఛార్జీలు పెంచలేదు.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 40 శాతం మెస్ చార్జీలు పెంచాం.. ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి ఐదు వేల కోట్లు కేటాయించామన్నారు. స్కూల్స్ ప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫాంలు సరఫరా చేశామన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాత నెహ్రూజీ.. ఆయన నిర్ణయాలతోనే నేడు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.
Read Also: CM Revanth Reddy: 21 ఏళ్లు నిండిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి..
అలాగే, గుండు సూది కూడా ఉత్పత్తి చేయలేని దేశంలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి.. రాకెట్లు తయారు చేసే స్థాయికి ఈ దేశాన్ని నెహ్రూ తీసుకు వెళ్లారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ప్రజలు జీవించడమే కాదు గౌరవప్రదమైన హక్కులు వారికి ఉండాలని మన తొలి ప్రధాని నెహ్రూ ఆలోచనలు చేశారు.. శాస్త్రీయ విద్య, ఉపాధి కల్పనకు ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థలను స్థాపించుకున్నాం.. ఆధునిక దేవాలయాలు పిలుచుకునే బహులార్ధక సార్థక ప్రాజెక్టులు ఆయన ఆలోచనలే.. కృష్ణానదిపై నాగార్జునసాగర్, గోదావరి నదిపై ఎస్సారెస్పీ ప్రాజెక్టులు నిర్మించి ఈ రాష్ట్రం మీదుగా రెండు జీవ నదులు పారించేందుకు చాచా నెహ్రూ పునాదులు వేశారని వెల్లడించారు. భిన్నత్వంలో ఏకత్వంతో ఈ దేశాన్ని నడిపారు.. అటు అమెరికా కూటమి ఇటు రష్యా కూటమికి దూరంగా అలీన విధానంతో సమదూరం పాటించి స్వతంత్రంగా వ్యవహరించి ప్రపంచ దృష్టిని మన తొలి ప్రధాని ఆకర్షించారు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు.