కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్‌లో నేడు బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో.. భారత్ జోడో గర్జన పేరుతో లక్ష మందితో ఈసభను తలపెట్టారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ముగియనుంది. అక్టోబర్ 23న కర్ణాటక నుంచి తెలంగాణలోని మక్తల్‌లో భారత్ జోడో యాత్ర అడుగుపెట్టిందని..27వ తేదీ నుంచి ఈయాత్రకు తెలంగాణ ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభించింది.
డబుల్ ఇంజన్ లకు ట్రబుల్ మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందోల్ మండలం దానంపల్లి వద్ద జైరాం రమేష్ మాట్లాడారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పటికే వందలమంది విద్యార్థులు, కార్మికులు, సామాజిక వేత్తలను కలిశారని చెప్పారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో మంచి జోష్ నింపుతూ ముందుకు సాగుతోంది. యాత్రకు ఇలాంటి సమయంలో కేజీఎఫ్-2 చిక్కులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాటే, జైరాం రమేష్‌లపై కేసు నమోదైంది.