దేశాన్ని మళ్లీ ఏకం చేసేందుకు తెలంగాణలో భారత్ జోడో యాత్రతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధిక వేముల కలిసి సంఘీభావం తెలిపారు.
నేడు హైదరాబాద్‌లోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆపార్టీ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ సిటీలోకి ప్రవేశించింది.
పూనమ్ కౌర్ చేయి రాహుల్ కావాలని పట్టుకోలేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. పాదయాత్ర చేయని దిక్కుమాలిన పార్టీ ఒక బీజేపీ మాత్రమే అని మండిపడ్డారు. పాదయాత్రలు చేస్తే జనంతో ఎలా ఉండాలో తెలుస్తుందని అన్నారు.
రాష్ట్రంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ఆరోరోజు కొనసాగుతోంది. ఇవాల్టితో రాహుల్ గాంధీ మొదలు పెట్టిన భారత్ జోడో యాత్రకు 54వ రోజు. ఇవాళ షాద్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. సర్దార్ పటేల్, ఇందిరాగాంధీలకు నివాళులర్పించారు. గుజరాత్ కేబుల్ బ్రిడ్జి విషాద ఘటన బాధితులకు 2 నిముషాలు మౌనం పాటించారు.