జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఆయన ఆరోపించారు. మత విద్వేషాలను నిర్మూలించేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఉపాధి హామీ పథకం కూడా నిర్వీర్యం చేసే విధంగా కేంద్రం నిధుల కోత విధిస్తోందని ఆయన మండిపడ్డారు. అదాని అంబానీ లాంటి వ్యాపారస్తులకు NPA కింద లక్షల కోట్లు రుణ మాఫీ చేస్తున్నారని కానీ.. సామాన్య రైతుల ఇంకా రుణ మాఫీ కోసం చూస్తూనే ఉన్నాడని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడైనా 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు చూపిస్తే నేను కేసీఆర్‌కు పాల అభిషేకం చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. మా హయాంలో లో మిల్లర్ల కోతలు లేవని, నేడు అవి కొనసాగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : MP Badugula Lingaiah : రాజగోపాల్ రెడ్డి విచ్చల విడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు
సబ్సిడీలు ఎత్తేశారని, కేవలం రైతుబంధుతో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, లోపాలను సరి చేయాలిని ఆయన డిమాండ్ చేశారు. ధరణిలో సీఎం కేసీఆర్ భూమి వివరాలు కనపడవని, హెలికాప్టర్ లో కేసీఆర్, ఎమ్మెల్యే లను తెచ్చి మళ్ళీ తీసుకుపోయి ఫాం హౌస్ లో పెట్టిండంటూ ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య హక్కుల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం జోడో యాత్ర సాగుతోందని ఆయన వెల్లడించారు. భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.