Bengaluru: చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యం.. నిందితుడెవరంటే..!
- టెక్ సిటీ బెంగళూరులో దారుణం
- చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. ఒక చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లివ్ ఇన్ పార్ట్‌నర్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Yashasvi Jaiswal: అరుదైన మైలురాయికి అడుగు దూరంలో యశస్వి!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఆదివారం బెంగళూరు మున్సిపాలిటీకి చెందిన చెత్త ట్రక్కులో మహిళ మృతదేహం ప్రత్యక్షమైంది. ట్రక్కులో మృతదేహం కలిగిన గోనె సంచి లభించింది. చేతులు కట్టేసి.. సంచిలో కుక్కేసినట్లుగా కనిపించింది. దీంతో బీబీఎంపీ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించి.. మృతురాలు ఆశ (40)గా గుర్తించారు. ఆమెకు మహ్మద్ షంషుద్దీన్ (33) అనే యువకుడితో సంబంధం ఉన్నట్లుగా కనుగొన్నారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
ఇది కూడా చదవండి: Srisailam: శ్రీశైలం భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన నిలుపుదల
ఏడాదిన్నరగా ఆశ, మహ్మద్ షంషుద్దీన్ సహజీవనం చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మహ్మద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లంతా అస్సాంలో ఉంటున్నారు. ఇక ఆశ వితంతువుగా ఉంది. ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. దక్షిణ బెంగళూరులోని హులిమావులో ఇద్దరూ అద్దె ఇంట్లో ఉంటూ భార్యాభర్తలుగా మసులుకుంటున్నారు. ఆశా అర్బన్ కంపెనీలో పనిచేసేది మరియు హౌస్ కీపింగ్ సేవలను అందించేది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. అనంతరం మహ్మద్ షంషుద్దీన్ ఆమె గొంతుకోసి చంపేశాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్) లోకేష్ బి జగలసర్ తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి చెత్త ట్రక్కులో వేశాడని చెప్పారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ఆధారంగా నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!