Bengaluru: బెంగళూర్‌లో దారుణం జరిగింది. పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న విద్యార్థినిపై పీజీ ఓనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడు అష్రఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 10 రోజుల క్రితమే తాను అష్రఫ్ ప్రాపర్టీలోకి పేయింగ్ గెస్ట్‌గా వచ్చానని సదరు విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొంది.
Read Also: Viral Video: లగేజీ విషయంలో గందరగోళం.. స్పైస్‌జెట్ ఉద్యోగులను చితకబాదిన ఆర్మీ అధికారి(వీడియో)
సోమవారం రాత్రి అష్రఫ్ తన గదిలోకి వచ్చి, తనకు సహకరిస్తే ఫుడ్, వసతి కల్పిస్తానని చెప్పాడని, అందుకు తాను అంగీకరించకపోవడంతో, బలవంతంగా కారులోకి ఎక్కించుకుని, ఒక గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదులో చెప్పింది. శనివారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగిటనట్లు వెల్లడించింది. తన లొకేషన్ స్నేహితులకు పంపే ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదని వెల్లడించింది. తెల్లవారుజామున 1.30 నుంచి 2.15 గంటల మధ్య అష్రఫ్ తనను పీజీలో దించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
బెంగళూర్‌లో నెల రోజుల క్రితం మరో పీజీలో ఇలాంటి సంఘటనే జరిగింది. పీజీ యజమాని రవితేజ రెడ్డి, 21 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడని ఆరోపించబడింది. ఆమె అదే ప్రాపర్టీలో వేరే అమ్మాయికి చెందిన మూడు బంగారు ఉంగరాలను దొంగిలించింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కోరినప్పుడు, తనపై అత్యాచారం చేసినట్లు విద్యార్థిని ఆరోపించింది.