Vistara Airline: ఎయిర్‌పోర్టు రన్‌వేపై ఓ వీధి కుక్క హల్‌చల్ చేసింది. దీంతో ల్యాండ్ అవ్వాల్సిన విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం వెనుదిరాగాల్సి వచ్చిన సంఘటన గోవాలోని దబోలిమ్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. సోమవారం విస్తారా ఎయిర్‌లైన్‌కు చెందిన యూకే 881 విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.55 గంటలకు గోవా బయలుదేరింది. ఆ విమానం దబోలియా ఎయిర్‌పోర్టుకు చేరుకుని సరిగ్గా రన్‌వేపై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. అప్పుడే రన్‌వే పై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వీధికుక్కను గమనించారు.
Also Read: Amazon: అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్.. ఈ సారి ఎంత మంది అంటే..
దీంతో పైలట్ కాసేపు హోల్డ్ చేయమని అడగ్గా.. పైలట్ మాత్రం పైలట్ బెంగళూరుకు తిరిగి వెళ్లడానికి ప్రిఫర్ చేశారని గోవా విమానాశ్రయం డైరెక్టర్ ఎస్‌వీటీ ధనంజయరావు చెప్పారు. అయితే కంపేగౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నంచి మధ్యాహ్నం 12.55కు బయలుదేరిన విస్తారా ఎయిర్‌లైన్.. 3.05 నిమిషాలకే తిరిగి బెంగళూరు వచ్చిందని, ఆ తర్వాత బెంగళూరు నుంచి సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి 6.15 గంటలకు గోవా చేరుకున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. కాగా వీధి కుక్క వళ్ల ప్యాసింజర్స్ దాదాపు మూడు గంటల వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Also Read: Niharika Konidela: నా ప్రియమైన వారికి ప్రేమ లేఖ.. నిహారిక ఇంట్రెస్టింగ్ పోస్ట్