కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల్లో పెళ్లి అనగా కాబోయే భర్త ఇంటిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో సోమవారం జరిగింది. అయితే కాబోయే అత్తింటివారే తమ కూతురిని చంపారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెపట్టారు. వివరాలు.. కర్ణాటకలోని విజయనగరం జిల్లాకు చెందిన ఐశ్యర్య, అశోక్ కుమార్‌లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మంచి ఉద్యోగంలో సెటిలైన ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని ఇంట్లో చెప్పారు. అయితే ఇద్దరు క్యాస్ట్ వేరు వేరు కావడంతో ఇరు కుటుంబ సభ్యులు నిరాకరించారు.
Also Read: PM MODI: ఓటమి బాధలో టీమిండియా ఆటగాళ్లు.. డ్రెసింగ్ రూమ్కు వెళ్లి ఓదార్చిన ప్రధాని
ఐశ్వర్య దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి.. అశోక్ కుమార్ గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వాడు. అశోక్ తల్లిదండ్రులు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. దీంతో పట్టుబట్టిను అశోక్ ఎదురించి మరి తల్లిదండ్రులను ఒప్పించడంతో వారు దిగి వచ్చారు. అటూ ఐశ్వర్య కూడా తన తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఒప్పించింది. అయితే అశోక్ కుటుంబం ఈ పెళ్లికి కొన్ని షరతులు పెట్టింది. పెళ్లి తర్వాత ఐశ్వర్య తన పుట్టింటికి అసలు వెళ్లకూడదని, పెళ్లికి కూడా ఎవరూ రావోద్దన్నారు. భవిష్యత్తులో కూడా ఐశ్వర్య తన తల్లిదండ్రులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని వారు కండిషన్ పెట్టారు. దానికి ఐశ్వర్యతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో నవంబర్ 23న పెళ్లికి ముహుర్తం పెట్టారు.
Also Read: Hyderabad: మైనర్ బాలిక ఆచూకీ లభ్యం.. 5 రోజులు, 200 సీసీ కెమెరాలు వడపోసిన హెడ్ కానిస్టేబుల్
దీంతో పెళ్లికి ముందు జరిగే వేడుకల కోసం ఐశ్వర్య కాబోయే భర్త ఇంటికి వెళ్లింది. అయితే ఎమైందో తెలియదు.. సోమవారం ఐశ్వర్య కాబోయే అత్తింటిలో ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. అప్పటికే ఐశ్వర్య చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. అయితే తమ కూతురు ఇలాంటి పరిస్థితలు ఉంటే తమకు సమాచారం ఇవ్వలేదని ఐశ్వర్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురిని కాబోయే అత్తింటి వారే హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. దళిత వర్గానికి చెందిన తమ కూతురిని కోడలిగా చేసుకోవడం ఇష్టం లేకనే కాబోయే అత్తింటివారు హత్య చేశారని ఐశ్వర్య తండ్రి సుబ్రమణ్యం పొలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కర్ణాటక పోలీసులు విచారణ చేస్తున్నారు.