Bengaluru: బెంగళూర్ దుకాణాల సైన్‌బోర్డుల్లో 60 శాతం కన్నడలో ఉండాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: తమిళనాడు, కర్ణాటకలో భాషాభిమానం మామూలుగా ఉండదు. కొన్ని సందర్భాల్లో కన్నడ మాట్లాడటం లేదని వేరే రాష్ట్రాల ప్రజలపై భౌతికదాడులు కూడా జరిగాయి. అయితే తాజాగా బెంగళూర్‌లోని అన్ని దుకాణాలకు, వాణిజ్య సంస్థలకు సంబంధించిన సైన్‌బోర్డుల్లో 60 శాతం కన్నడ భాషలోనే ఉండాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 28 నాటికి అన్ని సైన్ బోర్డులపై 60 శాతం కన్నడ నిబంధనలు పాటించని దుకాణాలు, హోటళ్లు, మాల్స్ లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించింది.
బెంగళూర్ లోని షాపుల నేమ్ బోర్డులపై కన్నడ భాషను ఉపయోగించడంపై బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అన్ని హోటళ్లు, మాల్స్, ఇతర దుకాణాలు తమ నేమ్ బోర్డులపై తప్పనిసరిగా కన్నడను ఉపయోగించాలని, పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరించింది.
Also Read
Read Also: Dunki: “డంకీ”కి అరుదైన గౌరవం.. రాష్ట్రపతి భవన్‌లో స్క్రీనింగ్..
బెంగళూర్ నగరంలో సైన్ బోర్డులపై కన్నడ భాష వినియోగానికి సంబంధించి నిబంధనలు పాటించని దుకాణాలను నోట్ చేయడానికి సర్వే చేపట్టనున్నారు. ఇటీవల చిక్‌పేటలో మార్వాడీ వ్యాపారులు, కన్నడ అనుకూల వర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆ తర్వాత బెంగళూర్ పౌర అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు పాటించని వారు తమ ట్రేడ్ లైసెన్సులు కోల్పోతారని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?