Driverless Train: దేశంలో తొలి డ్రెవర్ లెస్ మెట్రో రైల్.. బెంగళూర్‌లో ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Driverless Train: దేశంలో తొలిసారిగా డ్రైవర్ లేకుండా మెట్రో రైల్ పరుగులు తీయబోతోంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూర్‌లో డ్రైవర్ లెస్ ట్రైన్ కొన్ని రోజుల్లో పని ప్రారంభించనుంది. బెంగళూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(BMRCL) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూర్ లోని ఎల్లో లైన్‌లో 19 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు నడుస్తుందని తెలిపారు. ఆరు కోచుల రైలు జనవరి 20న చైనా నుంచి చెన్నైకి బయలుదేరింది. 2024 మధ్య లేదా ఫిబ్రవరి చివరినాటికి చెన్నై పోర్టుకు చేరబోతోంది. నిజానికి ఇది సెప్టెంబర్ 2023 వరకే రావాల్సి ఉంది. అయితే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 75 శాతం స్థానిక ఉత్పత్తి అవసరాలను కనుగొనడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఆలస్యం అయింది. దీనికి తోడు కోవిడ్-19, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వంటి విధానాలు, చైనాతో వాణిజ్య పరిమితులు వంటి అంశాలు కూడా జాప్యానికి కారణమయ్యాయి.
Read Also: Bihar political crisis: రంగంలోకి సోనియాగాంధీ.. నితీష్‌కు ఫోన్ చేస్తే రిప్లై ఇలా..!?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
చైనీస్ కంపెనీ CRRC, కోచ్‌ల తయారీ మరియు సరఫరా కోసం కోల్‌కతాకు చెందిన టిటాగర్ రైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కోచ్‌లను కోల్‌కతాకు సమీపంలోని ఉత్తర్‌పరాలోని టిటాగర్ తయారు చేస్తు్న్నారు. ఇన్ఫోసిస్, బయోకాన్ వంటి మల్టీనేషనల్ కంపెనీలకు నిలయమైన దక్షిణ బెంగళూర్ లోని ఎలక్ట్రానిక్స్ సిటీని కలిపే ఎల్లో లైన్ ఈ మెట్రో సేవలను అందిస్తుంది. మొత్తం కోచ్‌లలో, 126 (21 ఆరు-కోచ్ రైళ్లు) పర్పుల్ మరియు గ్రీన్ లైన్‌లలో అమర్చబడతాయి, మిగిలిన 90 కోచ్‌లు (15 ఆరు-కోచ్ రైళ్లు) ఎల్లో లైన్‌లో సేవలు అందిస్తాయి. సెప్టెంబర్ 2024లోగా ఈ రైళ్లు పట్టాలెక్కాల లక్ష్యం పెట్టుకున్నారు. రైళ్లు బెంగళూర్ చేరిన తర్వాత కొన్ని రోజుల పాటు ట్రైల్ రన్స్ నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!