Bengaluru cafe blast: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ పేలుడు జరిగి వారం గడుస్తోంది. ఇప్పటికీ నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు వేటను సాగిస్తూనే ఉన్నాయి. నిందితుడికి సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా కర్ణాటక పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే నిందితుడికి సంబంధించిన తాజా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ముసుగు దరించి బూడిద రంగు చొక్క ధరించినట్లు ఈ వీడియోలో చూడవచ్చు.
Bengaluru water crisis: బెంగళూర్ నగరంలో నీటి కొరత తీవ్రమవుతోంది. ఇప్పటికే ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నీటి ట్యాంకర్ల పేరుతో దోపిడి చేసేవారిపై ఉక్కుపాదం మోపడంతో పాటు నీటి వృథాను అరికట్టేందుకు జరిమానాలను విధిస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పలు గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే నివాసితులు మాత్రం నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు.
Bengaluru Blast: గత వారం జరిగిన బెంగళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు విచారణ వేగవంతమైంది. నిందితుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే విషయాలను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. ఈ కేసులో మంచి సమాచారం లభించిందని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర గురువారం తెలిపారు. పేలుడు జరిగిన తర్వా నిందితుడు తన దుస్తుల్ని మార్చుకుని తుమకూరు పట్టణం వైపు వెళ్లినట్లు తెలిసిందని, బళ్లారి వరకు అతని కదలికలను ట్రేస్ చేసినట్లు మంత్రి ధ్రువీకరించారు.
దేశంలోనే గ్రీన్‌సిటీగా పేరుగాంచిన బెంగళూరు నగరం (Bengaluru) తీవ్ర దాహార్తితో అల్లాడుతోంది. ఎన్నడూ లేని విధంగా తాగునీటి కష్టాలతో (Water Crisis) ఐటీ సిటీ కటకట లాడుతోంది.
Bengaluru Cafe Blast : బెంగళూరు కేఫ్‌లో పేలుడు నిందితుడి ఫోటోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో నిందితుడు టోపీ పెట్టుకుని బస్సులో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది.
భారత దేశంలోని మెట్రోపాలిటన్ సిటిల్లో కారును పార్కింగ్ చేయడం చాలా కష్టం.. రోడ్లకు దగ్గరలో బిల్డింగ్ లను కట్టడంతో పాటు అస్సలు ఖాళీ స్థలం అనేది లేకుండా ఆక్రమించడం వల్ల వాహనాల పార్కింగ్ పెద్ద ఇబ్బందిగా మారింది.. దాన్నే కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు.. పెయిడ్ పార్కింగ్ పేరుతో దండుకుంటున్నారు.. ముఖ్యంగా బెంగుళూరు వంటి మహానగరంలో ఇలాంటి సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.. కేవలం పార్కింగ్ కోసమే అయితే నెలకు 500 రూపాయలు కట్టొచ్చు. కానీ ఇలా గంటకు రూ.1000…
కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎట్టిపరిస్థితుల్లోనూ తగిన నీటి సరఫరా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగళూరులోని అన్ని ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, తన ఇంటి వద్ద ఉన్న బోరుబావి కూడా ఎండిపోయిందన్నారు
బెంగళూర్‌లో దారుణం జరిగింది. పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదనే కోపంతో ఓ మహిళ నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచింది. ఈ సంఘటన ఫిబ్రవరి 27 తెల్లవారుజామున జరిగింది. 35 ఏళ్ల మహిళ, 37 ఏళ్ల తన భర్తపై దాడి చేసింది. వెంటనే తేరుకున్న అతను భార్యను పక్కకు నెట్టేయడంతో బతికిపోయాడు. గాయాలతో ఉన్న అతను ఆస్పత్రికి వెళ్లేందుకు పొరుగువారి సాయం తీసుకున్నాడు. మెడికో లీగల్ కేసు కావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.
సిలికాన్ సిటీ బెంగళూర్ వేసవి కాలం పూర్తిగా రాకముందే తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నగరంలోని పలు ప్రాంతాలు నీటి కొరతను చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని డ్రై ప్లేసెస్‌కి నీటిని సరఫరా కోసం ప్రైవేట్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రోజూవారీ నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడే ప్రైవేట్ అపార్ట్మెంట్ల సమస్యను మరింత తీవ్రతరం చేసింది. కనకపురా రోడ్‌లోని ప్రెస్టీజ్ ఫాల్కన్ సిటీ అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ నీటి…