Bengaluru: మరింత నీటి సంక్షోభం దిశగా బెంగళూరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో నీటి సంక్షోభం మరింత ముదిరింది. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక చిన్నారులు, వృద్ధులైతే గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకక బెంబేలెత్తిపోతున్నారు. ఓ వైపు విపరీతమైన ఎండలు.. ఇంకోవైపు నీటి ఎద్దడి.. కనీసం తాగేందుకు కూడా నీళ్లు లభించక విలవిలలాడుతున్నారు. గత రెండు నెలలగా అవస్థలు పడుతున్న జనాలు.. ఇప్పుడు ఆ పరిస్థితులు మరింత తీవ్రతరం కావడంతో ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు కురవాలంటూ దేవునికి మొక్కుతున్నారు.
బెంగళూరులో నీటి బావులు, బోర్లు, కాలువలు అన్ని ఎండిపోయాయి. దీంతో చుక్క నీరు కోసం కష్టపడాల్సిన దుస్థితి ఏర్పడింది. అధిక డబ్బులు వెచ్చించి తీసుకొచ్చిన కొన్ని నీళ్లతోనే అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు. మరికొన్ని చోట్ల రీసైక్లింగ్ చేసుకుని వాడుకుంటున్నారు. నీటి ట్యాంకర్లు కూడా సరిగ్గా దొరకడం లేదు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాలుగు ట్యాంకర్లు అవసరం ఉన్న చోట కేవలం ఒక ట్యాంకరే వస్తోంది. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక వాసి వాపోయాడు. పైగా ట్యాంకర్లు కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
Also Read
- ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
- IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
- World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
రుతుపవనాలు త్వరగా వస్తే మంచి రోజులు వస్తాయని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే ఈ దుస్థితి తలెత్తిందని ప్రజలు మండిపడుతున్నారు. తాగునీటి కోసం కిలోమీటరు పొడవునా క్యూలో వేచి ఉండాల్సి వస్తోందని.. గత నెల రోజుల్లో 5 సార్లు మాత్రమే స్నానం చేసినట్లు ప్రజలు వాపోయారు.
బెంగళూరు ప్రధానంగా కావేరి నది.. భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉంటుంది. అలాగే మురుగునీటిని శుద్ధి కర్మాగారాల ద్వారా రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగిస్తారు. కానీ గత కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో నీటి లభ్యత తగ్గిపోయింది. ఇలా రెండు నెలలుగా అవస్థలు పడుతున్నారు. బెంగళూరుకు రోజూ 2,600-2,800 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం సగం కూడా దొరకడం లేదు. దీంతో నగరవాసులు రోజు నీళ్ల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక నివాస ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్లు అక్రమార్జనకు తెరలేపాయి. ట్యాంకర్లకు అధికారులు ధరలను నిర్ణయించారు. అయినా కూడా ఎక్కడా అమలు కావడం లేదు. ఇక వాహనాలను శుభ్రపరచడానికి.. వ్యవసాయం, నిర్మాణ పనులకు తాగునీటిని వినియోగిస్తే జరిమానాలు విధిస్తామని ప్రకటించారు. ఇక ఆస్పత్రుల్లో అయితే పరిస్థితులు మరింత భయంకరంగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే నీటి సంక్షోభం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ నీటి ఎద్దడికి మీరు కారణమంటే.. మీరు కారణమంటూ కాంగ్రెస్-బీజేపీలు విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. మరీ ఇప్పుడే ఇంత దారుణంగా నీటి సంక్షోభం ఉంటే.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
IPL 2027: ఐపీఎల్ 2027పై కీలక అప్డేట్.. సమావేశం వాయిదా..
-
Health News: చిన్నతనంలోనే క్యాన్సర్? ఇలా గుర్తించండి
-
Explainer: TVS ఫ్యామిలీ గొడవేంటి?
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
ట్రెండింగ్
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!