DK Shivakumar: బెంగళూరు నీటి సమస్యపై డిప్యూటీ సీఎం ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా నీటి సంక్షోభంతో బెంగళూరు వాసులు అల్లాడిపోతున్నారు. కనీస అవసరాలు తీరక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనేందుకు కూడా చాలా చోట్ల నీళ్లు లభించక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నీటి లభ్యతపై తాజాగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ స్పందించారు.
రాజధాని నగరం బెంగళూరులో నీటి సంక్షోభం లేదని డిప్యూటీ సీఎం తేల్చిచెప్పారు. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Also Read
- Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
- కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
- Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
- Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
బెంగళూరు ఎలాంటి నీటి ఎద్దడి లేదని పేర్కొన్నారు. సుమారు 7 వేల బోర్లు ఎండిపోయాయని చెప్పారు. అయితే ఆ సమస్యను ఎదుర్కొనేందుకు మేం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. నీటి వనరులను గుర్తించామని.. ట్యాంకర్లతో నీరు సరఫరా జరిగేలా చూస్తామని ఆయన వెల్లడించారు.
గతంలో డీకే.శివకుమార్ మరోలా స్పందించారు. తన నివాసంలో కూడా బోరు ఎండిపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి దుర్భిక్ష పరిస్థితిని గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదన్నారు. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు.
బెంగళూరులో నీటి కొరతను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోని బీజేపీ కూడా కారణమేనంటూ గతంలో ఆయన ఆరోపించారు. నగరంలో మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుత సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. అలాగే నగరంలోని వాటర్ మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాలను శుభ్రం చేసేందుకు, వినోదాలకు నీటిని వృథా చేసిన వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని ఇప్పటికే స్థానిక యంత్రాంగం హెచ్చరించింది.
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
-
కొండా సురేఖను బీఆర్ఎస్లోకి రానివ్వం.. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీష్ రెడ్డి
-
Sheikh Hasina: డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు వెళ్తా.. మరణశిక్షపై షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు
-
Krishna Janmashtami 2026: జన్మాష్టమి పూజలో ఈ 5 వస్తువులను సమర్పించండి.. అన్నీ శుభ ఫలితాలే..
-
Belgium: భారత్ ఎప్పుడో హెచ్చరించింది, మేము వినలేదు.. చైనాకు బెల్జియం ప్రధాని షాక్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!