‘ఈసాల కప్ నమదే’ అంటూ ఆర్సీబీ టీం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కల ఎట్టకేలకు 2024 లో సాకారమైంది. ఆదివారం మార్చి 17 రాత్రి మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ మహిళలు కప్ ఎత్తుకోగానే బెంగళూరు వీధుల్లో సంబరాలు మిన్నంటాయి. మరోవైపు సోషల్ మీడియాలోనూ స్మృతి మందన్నా టీమ్ కు విషెస్ వెల్లువెత్తాయి.
Also Read: Honor Killing: భార్గవి హత్యకేసులో ట్విస్ట్.. తల్లి కాదు ప్రియుడే..!
ఇందులో భాగంగానే నటుడు హీరో సిద్ధార్థ్ కూడా ఓ ట్వీట్ చేశారు. అయితే అతను ఏ ఉద్దేశంతో ట్వీట్ చేశాడో కానీ.. అది కాస్తా సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఈ ట్వీట్ సంబంధించి నెటిజన్లు సిద్ధూను తప్పుపడుతున్నారు. బెంగళూరు నగర వీధుల్లో ‘ఆర్సిబి’ జట్టు విజయాన్ని సంబరాలు చేసుకుంటున్న పురుషుల వీడియోను సిద్ధార్థ్ షేర్ చేస్తూ.. ‘ఒక టోర్నమెంట్ లో మహిళల జట్టు ట్రోఫీని గెలుచుకుంది. కానీ రోడ్డుపై సంబరాలు చేసుకునేందుకు ఒక్క మహిళ కూడా లేదంటూ పోస్ట్ చేసాడు. ఇది భారతదేశ పితృస్వామ్య వ్యవస్థకు ఇది సరైన ఉదాహరణని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
Also Read: Delhi: మరోసారి ఆ చెత్త రికార్డును దక్కించుకున్న ఢిల్లీ నగరం..!
అయితే ఈ విష్యం మాత్రం అభిమానులు, నెటిజన్లకు అసలు అర్థం అవ్వడంలేదు. అసలు మీ ఉద్దేశమేంటి..? మహిళల విజయాన్ని మగవాళ్లు సెలబ్రేట్ చేసుకోకూడదా..? అంటూ సిద్దూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దెబ్బకి తన మొదటి ట్వీట్ పై క్లారిటీ ఇస్తూ.. మరో ట్వీట్ చెసాల్సి వచ్చింది సిద్ధార్థ్ కు. ఇందులో ‘పైన ఉన్న ట్వీట్ పై పూర్తి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాని.. భారతదేశంలోని పబ్లిక్ ప్రదేశాలలో మహిళలు స్వేచ్ఛగా తిరగలేరన్నది నా ప్రధాన ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా మహిళలు పురుషులు లాగే రాత్రి, అర్ధరాత్రి సమయాల్లో వారికిఇష్టమైన జట్టు గెలిచిన సందర్భంలోనూ పురుషుల్లాగే మహిళలు కూడా వీధుల్లో సంబరాలు చేసుకోలేకపోతున్నారే అని నేను చెప్పాలనుకున్నాను’ అని వివరణ ఇచ్చాడు. అయినా కానీ నెటిజన్లు శాంతించకపోగా.. ట్రోల్ చేస్తూ పెద్దఎత్తున కామెంట్ల వర్షం కురిపించారు.
Yet another testament to the abysmal standards of India’s mainstream media—this time quite personal. pic.twitter.com/sf6B9fgH6J
— Siddharth (@DearthOfSid) March 18, 2024