కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆమెపై బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
Snake In Amazon Order: బెంగళూరు ( Bengaluru )లోని ఓ జంట ఆదివారం అమెజాన్ లో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్యాకేజీలో పాము కనిపించడంతో షాక్ అయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లైన దంపతులిద్దరూ ఆన్లైన్ లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ను ఆర్డర్ చేశారు. అయితే వారికి అమెజాన్ ప్యాకేజీలో ఉన్న నాగుపామును చూసి షాక్ అయ్యారు. విషపూరితమైన పాము అదృష్టవశాత్తూ ప్యాకేజింగ్ టేప్కు అంటుకపోవడంతో హాని కలిగించలేదు. ఇందుకు సంబంధించి ఆ జంట ఓ వీడియోను…
బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్శిటీలో విషాదం చోటుచేసుకుంది. 19 ఏళ్ల విద్యార్థిని తన హాస్టల్ గదిలో శవమై కనిపించింది. మృతురాలు కోలారు జిల్లా శ్రీనివాసపూర్కు చెందిన పవన అనే విద్యార్థినిగా గుర్తించారు
తనపై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం జూన్ 17వ తేదీన సిఐడి ముందు హాజరవుతానని బీజేపీ సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్ప జూన్ 15 శనివారం తెలిపారు. తనపై కుట్రలకు పాల్పడుతున్న వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ సీఎం బెంగళూరులో అన్నారు. పోక్సో కేసుకు సంబంధించి యడ్యూరప్పను అరెస్టు చేయకుండా కర్ణాటక హైకోర్టు శుక్రవారం సీఐడీని నిలువరించింది. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ ఎదుట జూన్ 17న హాజరుకావాలని బీజేపీ సీనియర్…
ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మోసం, అకౌంట్లలో అవకతవకలు అలాగే సంస్థతో సంబంధం ఉన్న జంటను బెదిరించిన ఆరోపణలపై కేంద్ర మంత్రి వీ సోమన్న కుమారుడు అరుణ్ బీఎస్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అక్కడి 37వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు వారు తెలిపారు. ఎఫ్ఐఆర్ ప్రకారం., తృప్తి, తన భర్త మధ్వరాజ్తో కలిసి గత 23 సంవత్సరాలుగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నడుపుతున్నట్లు…
కర్ణాటకలో మరోసారి పాక్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఆ మధ్య కర్ణాటక అసెంబ్లీలో పాక్ నినాదాలు వినబడినట్లు వార్తలు కలకలం రేపాయి. తాజాగా బెళగావి న్యాయస్థాన ప్రాంగణంలో పాకిస్థాన్ అనుకూల నినాదాలు సంచలనంగా మారింది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్.. బీజేపీ అభ్యర్థి సీఎన్ మంజునాథ్ చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో.. కర్ణాటకలో అధికార పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాగా.. డీకే సురేష్ బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కర్ణాటకలో 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక కాంగ్రెస్ అభ్యర్థి అయిన మూడుసార్లు ఎంపీగా గెలిచిన శివకుమార్కు ఎదురుదెబ్బ అనే చెప్పవచ్చు.
విద్యార్థినిల ఫొటోలు మార్ఫింగ్ చేసి వాట్సాప్లో ప్రచారం చేస్తున్న నలుగురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. విద్యార్థినులంతా ఒకే కాలేజీకి చెందిన వారు కాగా.. నలుగురు యువకులు కూడా అదే కాలేజీలో పూర్వ విద్యార్థులు. కాగా.. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ విద్యార్థిని తండ్రి మే 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆదివారం భారీ వర్షం కురిసింది. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం తడిసిముద్దైంది. ఈ క్రమంలో.. బెంగళూరు నగరానికి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన రెండు రోజుల్లోనే.. బీభత్సమైన వర్షం కురిసింది. ఈ క్రమంలో.. జూన్లో ఒక్క రోజులో కురిసిన అత్యధిక వర్షపాతంతో 133 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.