కొత్త సంసారంలో ఏం కలహాలు వచ్చాయో.. ఏమో తెలియదు గానీ ఓ నూతన జంట షాకింగ్ నిర్ణయం తీసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకోగా.. గంటల వ్యవధిలో భర్త కూడా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన టెక్ సిటీ బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: US: గగనతలంలో ప్రమాదం.. 2 హెలికాప్టర్లు ఢీ.. వీడియో వైరల్
గన్వి (26), సూరజ్ శివన్న (36) భార్యాభర్తలు. అక్టోబర్ 29న బెంగళూరులో వివాహం జరిగింది. అనంతరం హనీమూన్ కోసం శ్రీలంక టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ప్రయాణం అర్థాంతరంగా రద్దైంది. వివాదం కారణంగా గత వారం తిరిగి బెంగళూరు చేరుకున్నారు. భార్యాభర్తల మధ్య ఏం సంఘర్షణ జరిగిందో ఏమో తెలియదు గానీ గత మంగళవారం గన్వి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటిలేటర్‌పై రెండు రోజులు చికిత్స అందించారు. గత గురువారం వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Trump-Zelensky: ట్రంప్-జెలెన్‌స్కీ భేటీ.. చివరికి ఏం తేలిందంటే..!
ఇక గన్వి మృతి తర్వాత బాధిత కుటుంబ సభ్యులు బెంగళూరులోని సూరజ్ శివన్న, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపుల ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా నిందితులను అరెస్ట్ చేయాలంటూ అత్తమామల ఇంటి ముందు నిరసనకు దిగారు. ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సూరజ్ శివన్న, అతడి తల్లి జయంతి మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు బయల్దేరి వెళ్లిపోయారు. దాదాపు రెండు రోజుల పాటు 1,000 కి.మీలు ప్రయాణం చేసి వార్ధా రోడ్‌లోని ఒక హోటల్‌లో దిగిన తర్వాత తల్లితో పాటు శివన్న ఆత్మహత్యాయత్నం చేశాడు. శివన్న ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోగా.. తల్లి జయంతి పరిస్థితి విషమంగా ఉంది.

వెంటనే శివన్న సూరజ్ సోదరుడు సంజయ్ నాగ్‌పూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అత్తమామల వేధింపులు కారణంగానే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంసారంలో తలెత్తిన కలహాలు నూతన జంట ప్రాణాలు తీశాయి.